డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్‌.. బాక్సాఫీస్ వద్ద జోరు! | Varun Sandesh Latest Movie Nindha Gets Positive Response In Theatres | Sakshi
Sakshi News home page

Varun Sandesh: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న వరుణ్ సందేశ్ మూవీ!

Published Mon, Jun 24 2024 8:04 PM | Last Updated on Mon, Jun 24 2024 8:47 PM

Varun Sandesh Latest Movie Nindha Gets Positive Response In Theatres

వరుణ్ సందేశ్, అన్నీ, శ్రేయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన  చిత్రం నింద. ఈ సినిమాను రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్  తనలోని కొత్త కోణాన్ని చూపించి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా వరుణ్‌కు మంచి కమ్‌బ్యాక్  అవుతుందని ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ సందేశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా వసూళ్లపరంగా  దూసుకెళ్తోంది. వరుణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌ సాధించింది. ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ముఖ్య పాత్రలు పోషించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement