తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు: వరుణ్‌ సందేశ్‌ | Varun Sandesh about nindha movie | Sakshi
Sakshi News home page

తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేరు: వరుణ్‌ సందేశ్‌

Jun 19 2024 12:24 AM | Updated on Jun 19 2024 12:24 AM

Varun Sandesh about nindha movie

‘‘నింద’ చిత్రంలోని నా పాత్రకి, నిజ జీవితంలోని నాకు అస్సలు పోలిక ఉండదు. నేను సరదాగా ఉంటాను. సీరి యస్‌గా ఉండను. ‘నింద’లో నా మనస్తత్వానికి భిన్నమైన పాత్ర చేశాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను’’ అని వరుణ్‌ సందేశ్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం వరుణ్‌ సందేశ్‌ మీడియాతో పంచుకున్న విశేషాలు.

నా కెరీర్‌లో ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా అనిపించింది. దీంతో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని యూఎస్‌ వెళ్లాను. అక్కడ రాజేశ్‌గారు ‘నింద’ కథ చెప్పారు. నచ్చడంతో ఈ సినిమా చేశాను. ‘కానిస్టేబుల్‌’ సినిమా షూటింగ్‌లో నా కాలికి గాయమైంది. అయితే రాజేశ్‌గారి డెడికేషన్‌ చూసి రిస్క్‌ చేసి ఆ గాయంతోనే ‘నింద’ షూటింగ్‌లో పాల్గొన్నాను. 

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ జానర్‌లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘నింద’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నటీనటుల్లో ఎవరికీ ఈ మూవీ పూర్తి కథను చెప్పలేదు రాజేశ్‌గారు. దీంతో ఆర్టిస్టుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ పెరిగింది. కథ పరంగా అసలు నేరస్థుడు ఎవరనే విషయాన్ని నేను కూడా చెప్పలేకపోయాను. 

మా దర్శక–నిర్మాత రాజేశ్‌గారి ఫ్రెండ్‌ అమెరికాలో ‘నింద’ని రిలీజ్‌ చేస్తున్నారు. ఆయన మైత్రీ మూవీస్‌ నవీన్‌గారికి తెలుసు. అలా మైత్రీ శశిగారు మా సినిమా చూడటం, నచ్చడంతో నైజాంలో విడుదల చేస్తున్నారు. ‘నింద’ తర్వాత ఓ క్రేజీ ్రపాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. అలాగే ‘కానిస్టేబుల్‌’ అనే సినిమాలో నటిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement