
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్. వరుస హిట్లు పడడంతో స్టార్ హీరో అవ్వడం పక్కా అని అనుకున్నారంతా. కానీ ఆ రెండు తప్ప వరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఒకనొక దశలో వరుణ్ సందేశ్ అనే హీరో ఉన్నాడనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు.
కానీ 2019లో బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా వరుణ్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ బుల్లితెర బిగ్ రియాల్టీ షోలో భార్య వితికాతో కలిసి పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. దాదాపు 105 రోజుల వరకు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉన్నాడు. తాజాగా తన బిగ్‌బాస్ జర్నీ గురించి చెబుతూ వరుణ్ ఎమోషనల్ అయ్యాడు.
‘బిగ్‌బాస్ షో నా కెరీర్ పరంగా ఎంత హెల్ప్ అయిందని చెప్పలేను కానీ.. పర్సనల్‌గా, ఫైనాల్షియల్‌గా చాలా ఉపయోగపడింది. ఈ షోలో పాల్గొనకంటే ముందు జనాలకు నాపై ఓ రకమైన అభిప్రాయం ఉండేది. నాకు యాటిట్యూడ్ ఎక్కువైనని, ప్లే బాయ్ అని ఏవోవో అనుకునేవాళ్లు. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత నేను ఎలాంటివాడినో జనాలకు అర్థమైంది.
ఆ షో నుంచి బయటకు వచ్చాకా చాలా మెసేజ్‌లు వచ్చాయి. వాళ్లు చూపించిన ప్రేమ మరచిపోలేనిది. హ్యాపీడేస్, కొత్త బంగారులోకం తర్వాత కూడా అంత ప్రేమను నేను చూడలేదు. ప్రజలకు నేను పర్సనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేసింది బిగ్‌బాస్ షోనే. నా లైఫ్‌లో ఆ 105 రోజుల ఎక్స్‌పీరియస్ మర్చిపోలేను’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. వరుణ్ నటించిన తాజా చిత్రం ‘నింద’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment