– రాజేష్ జగన్నాథం
‘‘మలయాళ సినిమాలు చూసి ఇలాంటి చిత్రాలు మన వద్దకు ఎందుకు రావడం లేదని తెలుగు ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మా ‘నింద’ చూశాక ‘బాగా తీశారు.. మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి’ అనుకుంటారు. ఒక్క మాటలో చె΄్పాలంటే ‘నింద’ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అని చిత్ర దర్శక–నిర్మాత రాజేశ్ జగన్నాథం అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది.
ఈ సందర్భంగా రాజేశ్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘మాది నర్సాపురం. నెల్లూరు, చెన్నై, యూఎస్‌లో చదువుకుని, అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండి΄ోయాను. ఫిల్మ్ మేకింగ్‌లో కోర్సులు చేసి, అక్కడే షార్ట్ ఫిలింస్ చేశాను. వాస్తవ ఘటనలు, కల్పిత సన్నివేశాలతో ‘నింద’ స్క్రిప్ట్ రాశాను. ఈ కథ వరుణ్ సందేశ్‌కి మంచి కమ్ బ్యాక్‌లా ఉంటుందని భావించి ముందుకెళ్లాం. కథపై ఉన్న నమ్మకంతోనే నేనే నిర్మించాను. ఈ మూవీలో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. ‘నింద’ తర్వాత ఎక్కువగా దర్శకత్వం మీదే ఫోకస్ పెడతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment