వరుణ్ సందేశ్- వితికా షెరు.. ఒకప్పుడు తెలుగులో హీరోహీరోయిన్లుగా పని చేశారు. వరుణ్ ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వితికా షెరు.. యూట్యూబ్ వీడియోల ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే తన ఇంటిని కొత్తగా తీర్చిదిద్దింది. తనకు నచ్చినట్లుగా రీడిజైన్ చేయించుకుంది. ఇక వితికాకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక.
అడుగుతూనే ఉన్నారుగా..
ఎప్పుడూ ఇదే ప్రశ్న ఎదురవడంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫన్నీ రిప్లై ఇచ్చింది. 'పిల్లల్ని ఎప్పుడు కంటారు? అని జనాలు నన్ను అడుగుతూనే ఉన్నారు కదా.. ఇదిగో ఈ పిల్లవాడు పెద్దయ్యాక కంటాను' అని ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో వరుణ్.. వితిక ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నా భర్త ఇంకా పిల్లాడే అని పోస్ట్ చేయడంతో ఆన్సర్ అదిరిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
షూటింగ్‌లో లవ్
కాగా వీరిద్దరూ 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమా షూటింగ్‌లో నిజంగా లవ్‌లో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2016లో పెళ్లి చేసుకున్నారు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్‌లోనూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో వితికపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొంతకాలం పాటు డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. కానీ భర్త అండ వల్ల దాన్నుంచి బయటపడింది.
చదవండి: షార్ట్‌కట్స్ కావాలా? ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశా.. ఇక చాలు!
Comments
Please login to add a commentAdd a comment