Vithika Sheru Face Body Shaming Share Photos For Troll - Sakshi
Sakshi News home page

ట్రోలర్స్​కు ఫోటోలతో ​ కౌంటర్​​ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ

Published Thu, Jun 8 2023 2:29 PM | Last Updated on Thu, Jun 8 2023 3:23 PM

Vithika Sheru Face Body Shaming Share Photos For Troll - Sakshi

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి 'భీమవరం' బ్యూటీ వితికా షేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తనపై వస్తున్న దారుణమైన ట్రోల్స్‌కు ఒక్క వీడియోతో ఫుల్​ స్టాప్​ పెట్టేసింది  నటి వితికా.  హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే మోడల్‌గా పాపులర్ అయిన ఈ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుణ్‌ సందేశ్‌ను పెళ్లాడింది. ఆపై సినిమాలకు గ్యాప్‌ రావడంతో వీళ్లిద్దరు కలిసి బిగ్ బాస్ షోలోకి జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఈ షోతో వితిక మరింత పాపులర్​ అయ్యింది.  ఇదీ చదవండి:

(ఇదీ చదవండిస్కూల్ రోజుల్లో లవ్.. కానీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను కూడా: దియా మీర్జా)

సోషల్​ మీడియాతో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూనే.. యూట్యూబ్‌లో వ్లాగ్స్​ చేస్తూ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను, షార్ట్‌ వీడియోలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి రితిక చేసిన ఓ రీల్‌ను షేర్​ చేసింది. అయితే, ఆ వీడియోకు దారుణమైన కామెంట్లను ఆమె ఎదుర్కొవాల్సి వచ్చింది. బాగా లావు అయిపోయావ్‌.. నువ్వు హీరోయిన్‌ అంటే నమ్మ బుద్ధి కావడం లేదనే కామెంట్లు వచ్చాయి. ఇలా నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్‌కు గురైంది. దీంతో పట్టుదలతో వితిక వర్కౌట్స్​ చేసి సుమారు 15 కేజీలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫొటోలను అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో షేర్​ చేసింది. వాటిని చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. 

(ఇదీ చదవండిరాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్‌ హీరోయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement