![Varun Sandesh's Wife Vithika Sheru Shares Their Home Tour Video - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/01/8/VarunSandesh-Vitika.jpg.webp?itok=KQsmO6bJ)
వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన చిత్రం 'పడ్డానండి ప్రేమలో మరి'. ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 19, 2016న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. హ్యాపీ డేస్ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా, ప్రియుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు.
తాజాగా వరుణ్ సందేశ్ భార్య తమ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. చాలా మంది అభిమానుల కోరిక మేరకే హోమ్ టూర్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే పాత ఇంటినే తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నట్లు తెలిపింది. తాము కొవిడ్ టైమ్‌లో అమెరికాలో ఉన్నామని వెల్లడించింది. మా అత్తయ్య ప్రత్యేకంగా ఇంటిని తీర్చిదిద్దారని వితికా పేర్కొంది. కాగా.. ఇటీవలే వరుణ్ సందేశ్- వితికా శేరు అయ్యప్ప పూజలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment