Hero Nikhil About His Struggles During Cinema Career Beginning - Sakshi
Sakshi News home page

Hero Nikhil : 'రూ. కోటి ఇస్తే హీరో చేస్తామన్నారు.. మోసం చేశారు'.. నిఖిల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published Sat, Dec 24 2022 11:29 AM | Last Updated on Sat, Dec 24 2022 12:38 PM

Hero Nikhil About His Struggles During Career Beginning - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రస్తుతం ప్యాన్‌ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతున్నాడు. కార్తికేయ చిత్రంతో కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న నిఖిల్‌ రీసెంట్‌గా 18 పేజెస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్‌ తన సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. 

''అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నేను ఆ తర్వాత ఓ సీరియల్‌లో కూడా నటించాను. కానీ అక్కడే ఉండే బుల్లితెరకే పరిమితం అవుతాననిపించింది. దీంతో సినిమాలకు ఆడిషన్స్‌ ఇవ్వడం ప్రారంభించాను. కొందరికి నా యాక్టింగ్‌ నచ్చి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇంకొందరేమో నిన్ను హీరోగా చేయాలా? రూ 50లక్షలు, కోటి రూపాయలు తీసుకురా అనేవాళ్లు. అలా నేను హీరో అవ్వడానికి రూ.5లక్షలు ఇచ్చాను కూడా. లక్ష రూపాయల వరకు షూటింగ్‌ చేసి ఆపేశారు.

ఆ తర్వాత ఇదంతా ఫేక్‌ అని అర్థమయ్యింది. ఇక శేఖర్‌ కమ్ముల గారు చాలా జెన్యూన్‌. నా యాక్టింగ్‌ నచ్చి ఛాన్స్‌ ఇచ్చారు. ఆయనే ఫస్ట్‌ చెక్‌ ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని దాచుకున్నాను. ఆ సినిమా తర్వాతే నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కార్తికేయతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందా అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా'' అంటూ చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement