లవ్ యు బంగారమ్
లవ్ యు బంగారమ్
Published Sat, Nov 9 2013 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘లవ్ యు బంగారమ్’. గోవి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. కేఎస్ రామారావు సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఈ రోజుల్లో’ఫేం మారుతి, కె.వల్లభ నిర్మాతలు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘చిన్న బడ్జెట్‌తో విజయవంతమైన సినిమాలు తీసి కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టాడు మారుతి. అందుకే అతనితో ఓ సినిమా చేయాలనిపించింది. క్యాచీ టైటిల్ పెట్టి భిన్నమైన లుక్‌తో సినిమాకు క్రేజ్ తెచ్చాడు మారుతి.
ఇటీవలే రషెస్ చూశాను. మారుతీ ఖాతాలో మరో విజయం ఖాయం’’ అన్నారు. ‘‘స్టోరి లైన్‌ని ఎంత ఆసక్తికరంగా చెప్పాడో... అలాగే తెరకెక్కించాడు గోవి. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ నెల 20న పాటలను, డిసెంబర్ తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని మారుతి తెలిపారు. ఈ చిత్రానికి పనిచేయడం పట్ల చిత్రం యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బి.ఏ.రాజు, భార్గవి, డిఓపి అరుణ్‌కుమార్, ఎస్.కె.ఎన్., జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement