ఈ చిత్రంతో నాకు బ్రేక్ ఖాయం : అదిత్ | telugu happy days in Tamil remake | Sakshi
Sakshi News home page

ఈ చిత్రంతో నాకు బ్రేక్ ఖాయం : అదిత్

Published Wed, Mar 18 2015 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

ఈ చిత్రంతో నాకు బ్రేక్ ఖాయం : అదిత్

ఈ చిత్రంతో నాకు బ్రేక్ ఖాయం : అదిత్

తెలుగులో కథ, వీకెండ్ లవ్, తెలుగు ‘హ్యాపీ డేస్’ తమిళ రీమేక్‌తో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు అదిత్. ఇప్పటివరకు చేసినవి ట్రయల్ బాల్స్ లాంటివనీ, ఇప్పుడు చేసిన ‘తుంగభద్ర’ ఫస్ట్ బాల్ లాంటిదని అంటున్నారు. సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను అదిత్ పాత్రికేయులతో పంచుకున్నారు. ‘‘‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో ఈ సంస్థలో నేనో సినిమా చేయాల్సి ఉంది.
 
 కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ సినిమాకి కుదిరింది. సాయి కొర్రపాటిగారు మంచి చిత్రాలు నిర్మిస్తారు. అందుకే, ఈ చిత్రం ‘నా కెరీర్‌కి సరైన పునాది’ అంటున్నా’’ అని అదిత్ చెప్పారు. ఈ చిత్రకథ గురించి చెబుతూ, ‘‘ఇది నది నేపథ్యంలో సాగే కథ కాదు. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య జరిగే కథ. ఆ కథలో ఓ ప్రేమకథ ఉంటుంది. ఇందులో చేసిన కొర్లపూడి శ్రీను పాత్ర కోసం గుంటూరు యాసలో మాట్లాడాలి. మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువ.  నటనకు అవకాశం ఉన్న పాత్ర’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో నటనపరంగా నాకే లోపాలు కనిపించాయి. కానీ, ఈ చిత్రంలో బాగా నటించాననే సంతృప్తి కలిగింది. హీరో బాలకృష్ణ ఈ సినిమా చూసి, అభినందించారు. క్లయిమాక్స్ అర్థవంతంగా ఉంటుంది. నా కెరీర్‌కి తొలి బ్రేక్ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అని అదిత్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement