పల్లెటూరి ప్రేమ | village love Story "Tungabhadra" | Sakshi
Sakshi News home page

పల్లెటూరి ప్రేమ

Published Mon, Mar 9 2015 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

పల్లెటూరి ప్రేమ

పల్లెటూరి ప్రేమ

గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన చిత్రం ‘తుంగభద్ర’. ఆదిత్, డింపుల్ జంటగా గోగినేని శ్రీనివాసకృష్ణను

 గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన చిత్రం ‘తుంగభద్ర’. ఆదిత్, డింపుల్ జంటగా గోగినేని శ్రీనివాసకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమా గురించి  నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కదిలించేలా ఉంటుంది. దర్శకుడు అంత అందంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని అన్నారు. కోట శ్రీనివాసరావు, చలపతి, సప్తగిరి, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కెమెరా: రాహుల్ శ్రీ వాత్సవ్, నిర్మాత: రజని కొర్రపాటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement