Adit
-
ఎల్ అంటే లవ్...7 అంటే...?
ఆదిత్, పూజా ఝవేరి జంటగా ముకుంద్ పాండే దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ‘ఎల్ 7’ ఈ నెల 21న విడుదల కానుంది. ‘‘ఎల్’ అంటే లవ్.. ప్రేమకు, 7 సంఖ్యకు సంబంధం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు ఈ సినిమాను చక్కగా తీశారు. పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిం చింది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిశోర్, సహ నిర్మాతలు: బి.మోహన్‌రావు, సతీశ్ కొట్టె, పున్నయ్య చౌదరి. -
ఈ చిత్రంతో నాకు బ్రేక్ ఖాయం : అదిత్
తెలుగులో కథ, వీకెండ్ లవ్, తెలుగు ‘హ్యాపీ డేస్’ తమిళ రీమేక్‌తో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు అదిత్. ఇప్పటివరకు చేసినవి ట్రయల్ బాల్స్ లాంటివనీ, ఇప్పుడు చేసిన ‘తుంగభద్ర’ ఫస్ట్ బాల్ లాంటిదని అంటున్నారు. సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్‌పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను అదిత్ పాత్రికేయులతో పంచుకున్నారు. ‘‘‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో ఈ సంస్థలో నేనో సినిమా చేయాల్సి ఉంది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ సినిమాకి కుదిరింది. సాయి కొర్రపాటిగారు మంచి చిత్రాలు నిర్మిస్తారు. అందుకే, ఈ చిత్రం ‘నా కెరీర్‌కి సరైన పునాది’ అంటున్నా’’ అని అదిత్ చెప్పారు. ఈ చిత్రకథ గురించి చెబుతూ, ‘‘ఇది నది నేపథ్యంలో సాగే కథ కాదు. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య జరిగే కథ. ఆ కథలో ఓ ప్రేమకథ ఉంటుంది. ఇందులో చేసిన కొర్లపూడి శ్రీను పాత్ర కోసం గుంటూరు యాసలో మాట్లాడాలి. మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువ. నటనకు అవకాశం ఉన్న పాత్ర’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో నటనపరంగా నాకే లోపాలు కనిపించాయి. కానీ, ఈ చిత్రంలో బాగా నటించాననే సంతృప్తి కలిగింది. హీరో బాలకృష్ణ ఈ సినిమా చూసి, అభినందించారు. క్లయిమాక్స్ అర్థవంతంగా ఉంటుంది. నా కెరీర్‌కి తొలి బ్రేక్ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అని అదిత్ అన్నారు. -
పల్లెటూరి ప్రేమ
గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన చిత్రం ‘తుంగభద్ర’. ఆదిత్, డింపుల్ జంటగా గోగినేని శ్రీనివాసకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కదిలించేలా ఉంటుంది. దర్శకుడు అంత అందంగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని అన్నారు. కోట శ్రీనివాసరావు, చలపతి, సప్తగిరి, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కెమెరా: రాహుల్ శ్రీ వాత్సవ్, నిర్మాత: రజని కొర్రపాటి. -
వీకెండ్ లవ్ మూవీ ప్రెస్ మీట్
-
వీకెండ్ లవ్ మూవీ స్టిల్స్, వర్కింగి స్టిల్స్
-
వారాంతంలో రెండు రోజులు
‘‘దర్శకుడు కావాలన్న నా కలను నటుడు శ్రీహరి నెరవేర్చారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ప్రస్తుత ట్రెండ్‌లో వారాంతంలో రెండు రోజులు ఎలా గడుస్తున్నాయనేది ఈ చిత్రంలో చూపించాం. ఇందులో స్టార్ హీరోలు లేకపోయినా అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి’’ అని దర్శకుడు గవర నాగు చెప్పారు. అదిత్, సుప్రియా శైలజ జంటగా తోట మధు నిర్మిస్తోన్న ‘వీకెండ్ లవ్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని రమేశ్ ప్రసాద్ ఆవిష్కరించి, గుణ్ణం గంగరాజుకి అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘నాగు చాలా బాగా తెరకెక్కించాడు. శేఖర్‌చంద్ర మంచి ట్యూన్స్ ఇచ్చాడు. పాటలు ఈ సినిమాకు ఎస్సెట్ అవుతాయి’’ అని తెలిపారు. అదిత్, రవివర్మ, పూజ, కుంచెరఘు, బి.జయ, భాగ్యలక్ష్మి, సురేశ్ కొండేటి తదితరులు మాట్లాడారు. -
వీకెండ్ లవ్ మూవీ స్టిల్స్
-
వారాంతపు ప్రణయం
ఆదిత్, సుప్రియ శైలజ జంటగా నాగు గవర దర్శకత్వంలో మధు నిర్మిస్తోన్న చిత్రం ‘వీకెండ్ లవ్’. ఒక్క పాట మినహా సినిమా పూర్తయిందని, కేరళలో ఆ పాట చిత్రీకరిస్తామని నిర్మాత తెలిపారు. దివంగత నటుడు శ్రీహరి ప్రోత్సాహంతో ఈ సినిమా మొదలు పెట్టామని దర్శకుడు పేర్కొన్నారు. -
వీకెండ్ మూవీ ప్రెస్ మీట్