వారాంతంలో రెండు రోజులు | weekend for two days | Sakshi
Sakshi News home page

వారాంతంలో రెండు రోజులు

Published Fri, Apr 11 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

వారాంతంలో రెండు రోజులు

వారాంతంలో రెండు రోజులు

‘‘దర్శకుడు కావాలన్న నా కలను నటుడు శ్రీహరి నెరవేర్చారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ప్రస్తుత ట్రెండ్‌లో వారాంతంలో రెండు రోజులు ఎలా గడుస్తున్నాయనేది ఈ చిత్రంలో చూపించాం. ఇందులో స్టార్ హీరోలు లేకపోయినా అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి’’ అని దర్శకుడు గవర నాగు చెప్పారు.
 
 అదిత్, సుప్రియా శైలజ జంటగా తోట మధు నిర్మిస్తోన్న ‘వీకెండ్ లవ్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని రమేశ్ ప్రసాద్ ఆవిష్కరించి, గుణ్ణం గంగరాజుకి అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ-  ‘‘నాగు చాలా బాగా తెరకెక్కించాడు.
 
 శేఖర్‌చంద్ర మంచి ట్యూన్స్ ఇచ్చాడు. పాటలు ఈ సినిమాకు ఎస్సెట్ అవుతాయి’’ అని తెలిపారు. అదిత్, రవివర్మ, పూజ, కుంచెరఘు, బి.జయ, భాగ్యలక్ష్మి, సురేశ్ కొండేటి తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement