ఇటీవల ఇటలీలో రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ హీరోయిన్ గాయత్రి జోషి. ఈ సంఘటనతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ను పెళ్లాడిన గాయత్రి.. తన కెరీర్‌లో కేవలం ఓకే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. అయితే ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకుంది.
సార్డినియా సూపర్‌కార్ టూర్‌లో పాల్గొనేందుకు గాయత్రి, వికాస్ ఇటలీకి వెళ్లారు. ఇటలీలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా.. గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఇటలీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గాయత్రీ జోషి కెరీర్ ఎలా ప్రారంభమైంది?
1977లో నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రి ముంబైలోని కళాశాలలో చదువుతున్న సమయంలో మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. మోడల్‌గా ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ ప్రకటనలలో నటించింది. షారుఖ్ ఖాన్‌తో కూడా ఓ ప్రకటనలో మొదటిసారి కనిపించింది. 1999లో గాయత్రి మిస్ ఇండియా పోటీలో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది. జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2000లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది.
స్వదేశ్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం
2004లో మోడల్‌గా సక్సెల్ అయిన గాయత్రిని అశుతోష్ గోవారికర్ స్వదేశ్ చిత్రంలో నటించింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గాయత్రి తన తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. అయితే వికాస్ ఒబెరాయ్‌ని వివాహం చేసుకుని సినిమాలకు వీడ్కోలు పలికింది.
పెళ్లి తర్వాత గాయత్రి లైఫ్
గాయత్రి భర్త వికాస్.. ఒబెరాయ్ కన్‌స్ట్రక్షన్ ప్రమోటర్లలో ఒకరు. అతను భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 22,780 కోట్లు. ఇతరత్రా కలిసి ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 28000 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గాయత్రి, వికాస్‌లకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. ముంబయిలో నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment