last movie
-
శరత్ బాబు నటించిన చివరి సినిమా ఇదే!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) రామరాజ్యం సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. సాగర సంగమం, సితార, సీతాకోక చిలక చిత్రాలతో గుర్తింపు సాధించారు. సాగర సంగమంలో కమల్ హాసన్ ఫ్రెండ్‌గా కనిపించాడు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇలాంటి మిత్రుడు ప్రతీ ఒక్కరికి ఉండాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇక సితారలో మరో వైవిధ్యమైన పాత్ర వేసి మెప్పించాడు. ఆస్తులు అన్ని పోయినా పరువు కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టర్లో నటించి ఆకట్టుకున్నాడు. లోపల ఎంతో బాధ ఉన్న కూడా బయటకు మాత్రం గంభీరంగా కనిపించే క్యారెక్టర్లో అలరించాడు. ఎన్టీఆర్ లాంటి మహానటుడితో బంగారు మనిషి, లాయర్ విశ్వనాథం, శృంగార రాముడు, రామకృష్టుడు లాంటి సినిమాలలో నటించాడు. (ఇది చదవండి: Sarath Babu: శరత్‌బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..) కాగా.. ఆయన కెరీర్లో నటించిన చివరి చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఆయన ఇక లేడన్న వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
అదే నా చివరి సినిమా: యంగ్ హీరో
Udhayanidhi Stalin Announces Maamannan Will Be His Last Film: తెలుగులో డబ్ అయిన 'ఓకే ఓకే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఉదయనిధి స్టాలిన్. తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి హిట్ సాధించాడు. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ నటించిన తమిళ చిత్రం 'నెంజుకు నీధి'. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఆర్టికల్ 15'కు రీమేక్‌గా తెరెకెక్కిన ఈ సినిమా మే 20న విడుదల కానుంది. ఇది కాకుండా మారి సెల్వరాజ్ డైరెక్షన్లో 'మామన్నన్' అనే మూవీ చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. ఇందులో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం చెప్పాడు ఈ హీరో. ఉదయనిధి స్టాలిన్ నటించబోతున్న 'మామన్నన్' తన ఆఖరి సినిమా అని తెలిపాడు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను చెప్పినట్లు సమాచారం. కాగా ఉదయనిధి స్టాలిన్ తండ్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడని తెలిసిన విషయమే. తండ్రిలానే తాను కూడా రాజకీయాల్లో సెటిల్ అవ్వాలని ఉదయనిధి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అప్పుడే సినిమాలకు దూరం అవుతాడని టాక్ వచ్చినా అలా జరగలేదు. True power and strong Will -justice will be served! Bringing the action-packed story of #NenjukuNeedhi on the big screens on 20th May 🔥 #6DaysToGo@ZeeStudios_ @BoneyKapoor @BayViewProjOffl #RomeoPictures @mynameisraahul @RedGiantMovies_ @Arunrajakamaraj @actortanya pic.twitter.com/coh9iLNy0m — Udhay (@Udhaystalin) May 14, 2022 -
పునీత్ రాజ్‌కుమార్ సినిమా చూస్తూ అభిమానుల కంటతడి
Puneeth Rajkumar Fans Getting Emotional Seeing After James Movie: కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్ ఫీవర్ నడుస్తుంది. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది.మార్చి17న పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్నాటకలో ఎన్నలేని విధంగా 500 పైగా స్క్రీన్స్, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్ ప్రపంచ వ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు. చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో ఈ సినిమా చేసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. పునీత్ యాక్షన్స్ సీన్స్ చూసి ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తుంటే, తమ ఆరాధ్య హీరో చివరి సినిమా ఇదేనంటూ మరికొందరు భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు పునీత్‌ను తల్చుకొని అభిమానులు కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట Fans getting emotional seeing after #James movie🥺 Every fan is crying coming out of theatre seeing movie😔#PuneethRajkumar #HappyBirthdayPuneethRajkumar pic.twitter.com/JHlo6XrdB8 — Babu7@అన్నఫ్యాన్ (@Babu9440) March 17, 2022 -
పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం
Puneeth Rajkumar Last Movie James: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నడిగులు ఆరాధ్యదైవంలా అభిమానించే పునీత్ ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఇదిలా ఉంటే పునీత్ హఠాన్మరణంతో ఆయన చివరిగా సంతకం చేసిన రెండు సినిమాలు ప్రశ్నార్థకంగా మారాయి. చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’! మరణించే సమయానికి ఆయన నటిస్తున్న ‘జేమ్స్’ షూటింగ్ చివరి దశకు చేరుకోగా..మరో చిత్రం ద్విత్వ డిసెంబర్లో సెట్స్‌పైకి వచ్చేందుకు రెడీ అవుతోందట. దాదాపు 60 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న జేమ్స్ మూవీలో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నారు. దీని కోసమే ఆయన జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుతో ఆయన మరణించారు. ఇక జేమ్స్ మూవీ ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. ఆయన మృతి చెందడంతో సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ మూవీకి సంబంధించి పునీత్ యాక్షన్ పార్ట్ పూర్తయిందట. అలాగే షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి కావడంతో ఈ సినిమాను అభిమానుల కోసం వచ్చే ఏడాది ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చదవండి: పునీత్ రాజ్‌కుమార్: మళ్లీ ఇలా వస్తే ఎంత బాగుండో.. అంతా బాగానే ఉన్న ఆయన వాయిస్ డబ్బింగ్ దగ్గరే అసలు చిక్కొచ్చి పడిందట. పునీత్ వాయిస్ కాకుండా వేరే వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిస్తే.. అభిమానుల్లో అసంతృప్తి నెలకొంటుంది. అందుకే ఫ్యాన్స్‌ను నొప్పించకుండా పునీత్ వాయిస్‌తోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు అధునాత టెక్నాలజీ ఉపయోగించబోతున్నారట చిత్ర బృందం. ఇందుకోసం ముంబైకి చెందిన ఓ ఐటీ కంపెనీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్కాలజీతో ‘జేమ్స్’ షూటింగ్ సమయంలో పునీత్ రాజ్‌కుమార్ చెప్పిన డైలాగ్స్ క్వాలిటీ పెంచి విజువల్స్‌కు సింక్ చేసే ప్రయత్నం చేయబోతున్నారని సమాచారం. 2022 మార్చి 17న పునీత్ పుట్టినరోజు వరకు జేమ్స్ మూవీ పూర్తి చేసి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. -
ఓటీటీలోకి రానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం
దివంగత నటుడు, హీరో ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు ఏడేళ్లు అవుతుంది. చివరిసారిగా ఆయన నటించిన మూవీ ‘చిత్రం చెప్పన కథ’. ఉదయ్ కిరణ్ చనిపోయిన రెండు నెలలకు ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. కానీ ట్రైలర్ విడుదల అనంతరం ఇందులో హీరోయిన్గా నటించిన మదల్సా శర్మ తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీలలో కలిపి దాదాపు 15 సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ తన సినీ కేరీర్‌కు ప్లస్ అవుతుందని ఉదయ్ తన సన్నిహితులతో చెప్పుకున్నట్లు సమాచారం. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగానే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్నేళ్లకు ఈ మూవీని డిజిటల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అయితే 2020లో లాక్డౌన్లో విడుదల చేయాలని చూసినప్పటికీ రేటు విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా ఈ సెకండ్ వేవ్‌లో చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ చివరి సినిమా అయిన ‘చిత్రం చెప్పిన కథ’ కూడా ఎలాగైనా ఓటీటీలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు కాస్త గట్టిగానే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికంగానే ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో హీరో తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదరయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. అలాగే ఉదయ్ కిరణ్ చివరి సినిమా కాబట్టి అభిమానులు కూడా చూస్తారని ఓటీటీ సంస్థలు నమ్ముతున్నాయి. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎనిమిదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న మాట. -
సుశాంత్ చివరి చిత్రం ట్రైలర్ అప్డేట్
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరిగా నటించిన ‘దిల్ బేచారా’ ట్రైలర్ సోమవారం విడుదల కానుంది. ఇందకు సంబంధించి ఆ చిత్ర బృందం సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడిగా నటించిన సంజనా సంఘి కూడా ట్రైలర్ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి అని పేర్కొన్నారు. ఈ సినిమా ఒక అందమైన జర్నీ అని పేర్కొన్న సంజన.. మన్నీని(సుశాంత్) మిస్ అవుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ చిత్రం జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్స్క్రిప్షన్ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది.(చదవండి : ఆ సినిమాలను బాయ్‌కాట్ చేయండి) సుశాంత్ సన్నిహితుడు ముఖేష్ చబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ గ్రీన్ రచించిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంజన, సైఫ్ అలీఖాన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. గతంలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈలోపే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడం అందరిని షాక్‌కు గురిచేసింది. (చదవండి : సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) View this post on Instagram Kizie is just so incomplete without Manny. This, is one of my favourite shots, so surreal and dreamlike✨The #DilBechara trailer will be out tomorrow. You all? Just stay tuned! 🙏 #SushantSinghRajput @castingchhabra #SaifAliKhan @arrahman @shashankkhaitan @swastikamukherjee13 @sahilvaid24 @saswatachatterjeeofficial @suprotimsengupta @amitabhbhattacharyaofficial @foxstarhindi @disneyplushotstarvip @sonymusicindia @mukeshchhabracc A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jul 5, 2020 at 1:30am PDT -
అనుష్కకు అదే చివరి చిత్రమా?
నటి అనుష్కకు అదే ఆఖరి చిత్రమా? ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్న సంచలన అంశం ఇదే. తమిళం, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి అనుష్క. చారిత్రక కథా చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ యోగా సుందరి ప్రస్తుతం తమిళంలో సింగం-3, ద్విభాషా చిత్రం బాహుబలి-2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు అజిత్ నూతన చిత్రానికి, లారెన్స్‌కు జంటగా చంద్రముఖి-2 చిత్రానికి అనుష్క కాల్షీట్స్ అడుగుతున్నట్లు సమాచారం. బాగమతి అనే మరో భారీ చారిత్రక కథా చిత్రంలోనూ అనుష్క నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక సుప్రీం స్టార్ చిరంజీవి 150వ చిత్రంలోనూ హీరోయిన్గా ఈ బొమ్మాళి పేరు వినిపిస్తోంది.అసలు విషయం ఏమిటంటే 34 ఏళ్ల వయసు మీద పడ్డ ఈ ప్రౌడకు ఆమె కుటంబసభ్యులు పెళ్లి చేయాలని రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారట. అనుష్క వరుసగా చిత్రాలు ఒప్పుకుంటూ పెళ్లికి పచ్చజెండా ఊపడం లేదని ఆమె సన్నిహిత వర్గాల మాట. ఇటీవల మళ్లీ అనుష్క కుటుంబసభ్యులను నుంచి పెళ్లి ఒత్తిడి పెరిగిందని సమాచారం. అయితే ఈ సారి అనుష్క పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల తను కుటుంబసభ్యులతో కలిసి ఇంటిలో విశేష పూజలు కూడా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చిరంజీవితో నటించే చిత్రమే అనుష్క చివరి చిత్రం అనే టాక్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు అనుష్కగానీ ఆమె కుటుంబసభ్యులు గానీ నోరు విప్పితేనే తెలుస్తుంది. -
ఉదయ్‌కిరణ్ సినిమా విడుదలపై కోర్టు స్టే
దివంగత టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన చిట్టచివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'కు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. సినిమా విడుదలను ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. 'నువ్వునేను' సినిమా హీరోయిన్ అనిత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. మోహన్ ఎల్లార్కే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మున్నా నిర్మాత. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్‌కి నివాళి ఇవ్వాలనుకుంటున్నట్లు ఆ టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు అన్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత, దర్శకుడు భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో దీనికి కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పుడు చిత్ర విడుదల అనుమానంలో పడింది.