
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
(ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత)
రామరాజ్యం సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. సాగర సంగమం, సితార, సీతాకోక చిలక చిత్రాలతో గుర్తింపు సాధించారు. సాగర సంగమంలో కమల్ హాసన్ ఫ్రెండ్‌గా కనిపించాడు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇలాంటి మిత్రుడు ప్రతీ ఒక్కరికి ఉండాలి అని మాట్లాడుకుంటున్నారు.
ఇక సితారలో మరో వైవిధ్యమైన పాత్ర వేసి మెప్పించాడు. ఆస్తులు అన్ని పోయినా పరువు కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టర్లో నటించి ఆకట్టుకున్నాడు. లోపల ఎంతో బాధ ఉన్న కూడా బయటకు మాత్రం గంభీరంగా కనిపించే క్యారెక్టర్‌లో అలరించాడు. ఎన్టీఆర్ లాంటి మహానటుడితో బంగారు మనిషి, లాయర్ విశ్వనాథం, శృంగార రాముడు, రామకృష్టుడు లాంటి సినిమాలలో నటించాడు.
(ఇది చదవండి: Sarath Babu: శరత్‌బాబుకు కలిసిరాని పెళ్లిళ్లు! మూడుసార్లు..)
కాగా.. ఆయన కెరీర్‌లో నటించిన చివరి చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఆయన ఇక లేడన్న వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment