Udhayanidhi Stalin Announces Maamannan Movie Will Be His Last Film - Sakshi
Sakshi News home page

Udhayanidhi Stalin: అదే నా చివరి సినిమా: యంగ్‌ హీరో

Published Sat, May 14 2022 9:16 PM | Last Updated on Sun, May 15 2022 9:16 AM

Udhayanidhi Stalin Announces Maamannan Will Be His Last Film - Sakshi

Udhayanidhi Stalin Announces Maamannan Will Be His Last Film: తెలుగులో డబ్‌ అయిన 'ఓకే ఓకే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఉదయనిధి స్టాలిన్‌. తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి హిట్‌ సాధించాడు. ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌ నటించిన తమిళ చిత్రం 'నెంజుకు నీధి'. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'ఆర్టికల్‌ 15'కు రీమేక్‌గా తెరెకెక్కిన ఈ సినిమా మే 20న విడుదల కానుంది. ఇది కాకుండా మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో 'మామన్నన్‌' అనే మూవీ చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్‌. ఇందులో కీర్తి సురేష్‌, ఫహాద్‌ ఫాజిల్‌, వడివేలు వంటి స్టార్‌ యాక్టర్స్‌ నటిస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్‌ విషయం చెప్పాడు ఈ హీరో. 

ఉదయనిధి స్టాలిన్‌ నటించబోతున్న 'మామన్నన్‌' తన ఆఖరి సినిమా అని తెలిపాడు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్‌ చేయలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను చెప్పినట్లు సమాచారం. కాగా ఉదయనిధి స్టాలిన్‌ తండ్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడని తెలిసిన విషయమే. తండ్రిలానే తాను కూడా రాజకీయాల్లో సెటిల్‌ అవ్వాలని ఉదయనిధి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అప్పుడే సినిమాలకు దూరం అవుతాడని టాక్‌ వచ్చినా అలా జరగలేదు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement