అనుష్కకు అదే చివరి చిత్రమా? | Actress Anushka Last movie Chiranjeevi 150th movie | Sakshi
Sakshi News home page

అనుష్కకు అదే చివరి చిత్రమా?

Published Thu, May 19 2016 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

అనుష్కకు అదే చివరి చిత్రమా? - Sakshi

అనుష్కకు అదే చివరి చిత్రమా?

నటి అనుష్కకు అదే ఆఖరి చిత్రమా? ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంచలన అంశం ఇదే. తమిళం, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి అనుష్క. చారిత్రక కథా చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ యోగా సుందరి ప్రస్తుతం తమిళంలో సింగం-3, ద్విభాషా చిత్రం బాహుబలి-2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు అజిత్ నూతన చిత్రానికి, లారెన్స్‌కు జంటగా చంద్రముఖి-2 చిత్రానికి అనుష్క కాల్‌షీట్స్ అడుగుతున్నట్లు సమాచారం.
 
 బాగమతి అనే మరో భారీ చారిత్రక కథా చిత్రంలోనూ అనుష్క నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక సుప్రీం స్టార్ చిరంజీవి 150వ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఈ బొమ్మాళి పేరు వినిపిస్తోంది.అసలు విషయం ఏమిటంటే 34 ఏళ్ల వయసు మీద పడ్డ ఈ ప్రౌడకు ఆమె కుటంబసభ్యులు పెళ్లి చేయాలని రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారట. అనుష్క వరుసగా చిత్రాలు ఒప్పుకుంటూ పెళ్లికి పచ్చజెండా ఊపడం లేదని ఆమె సన్నిహిత వర్గాల మాట.
 
  ఇటీవల మళ్లీ అనుష్క కుటుంబసభ్యులను నుంచి పెళ్లి ఒత్తిడి పెరిగిందని సమాచారం. అయితే ఈ సారి అనుష్క పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల తను కుటుంబసభ్యులతో కలిసి ఇంటిలో విశేష పూజలు కూడా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చిరంజీవితో నటించే చిత్రమే అనుష్క చివరి చిత్రం అనే టాక్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు అనుష్కగానీ ఆమె కుటుంబసభ్యులు గానీ నోరు విప్పితేనే తెలుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement