
Puneeth Rajkumar Last Movie James: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కన్నడిగులు ఆరాధ్యదైవంలా అభిమానించే పునీత్ ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని ఇప్పటికే కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఇదిలా ఉంటే పునీత్ హఠాన్మరణంతో ఆయన చివరిగా సంతకం చేసిన రెండు సినిమాలు ప్రశ్నార్థకంగా మారాయి.
చదవండి: పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!
మరణించే సమయానికి ఆయన నటిస్తున్న ‘జేమ్స్’ షూటింగ్ చివరి దశకు చేరుకోగా..మరో చిత్రం ద్విత్వ డిసెంబర్‌లో సెట్స్‌పైకి వచ్చేందుకు రెడీ అవుతోందట. దాదాపు 60 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న జేమ్స్ మూవీలో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నారు. దీని కోసమే ఆయన జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుతో ఆయన మరణించారు. ఇక జేమ్స్ మూవీ ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. ఆయన మృతి చెందడంతో సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ మూవీకి సంబంధించి పునీత్ యాక్షన్ పార్ట్ పూర్తయిందట. అలాగే షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి కావడంతో ఈ సినిమాను అభిమానుల కోసం వచ్చే ఏడాది ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
చదవండి: పునీత్ రాజ్‌కుమార్: మళ్లీ ఇలా వస్తే ఎంత బాగుండో..
అంతా బాగానే ఉన్న ఆయన వాయిస్ డబ్బింగ్ దగ్గరే అసలు చిక్కొచ్చి పడిందట. పునీత్ వాయిస్ కాకుండా వేరే వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిస్తే.. అభిమానుల్లో అసంతృప్తి నెలకొంటుంది. అందుకే ఫ్యాన్స్‌ను నొప్పించకుండా పునీత్ వాయిస్‌తోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు అధునాత టెక్నాలజీ ఉపయోగించబోతున్నారట చిత్ర బృందం. ఇందుకోసం ముంబైకి చెందిన ఓ ఐటీ కంపెనీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్కాలజీతో ‘జేమ్స్’ షూటింగ్ సమయంలో పునీత్ రాజ్‌కుమార్ చెప్పిన డైలాగ్స్ క్వాలిటీ పెంచి విజువల్స్‌కు సింక్ చేసే ప్రయత్నం చేయబోతున్నారని సమాచారం. 2022 మార్చి 17న పునీత్ పుట్టినరోజు వరకు జేమ్స్ మూవీ పూర్తి చేసి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment