
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(46)ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో కన్నడ సినీ పరిశ్రమంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన హీరోహీరోయిన్లు, నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్..
ఇదిలా ఉంటే గతంలో ఆయన భవిష్యత్తు గురించి, చావు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పునీత్.. ‘భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. విధి రాతను ఎవరూ మార్చలేరు’ అంటూ చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇది చూసిన వారంత ‘అప్పుడు ఆయన తెలియదు ఈ రోజు మనకు దూరం అవుతారని, అయ్యో.. దేవుడా ఈ చేదు వార్తను నమ్మలేకపోతున్నాం. ఈ వార్త నిజం కాకూడదు.. ప్లీజ్ పునీత్ తిరిగి రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment