కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని హార్ట్ ఎటాక్స్ వెంటాడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది జరిగిన సంఘటనలను చూస్తుంటే. అగ్ర కథానాయకుడైన పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ, రాజ్‌కుమార్ గుండెపోటుతోనే చనిపోయారు. అలాగే ఆయన సోదరుడు, స్టార్ హీరో శివరాజ్ కుమార్ గతంలో గుండెపోటుతోనే చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. జిమ్ హెవీ వర్కౌట్స్ చేయడం వల్లే శివరాజ్ కుమార్‌కు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఆయన జిమ్‌లో అతిగా కష్టపడటం తగ్గించారు. ఇక నేడు అదే కారణంతో పునీత్ రాజ్‌కుమార్ మరణించడం బాధాకరం.
చదవండి: మరణం, డెస్టినీ గురించి పునీత్ రాజ్‌కుమార్ ఏమన్నారంటే..
పునీత్ తండ్రి రాజ్‌కుమార్ 77 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక 54 ఏళ్ల వయసులో జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తుండగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్‌కు ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయనను వెంటనే బెంగళూరు విఠల్‌మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో ఆయనకు వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి ఆయన జిమ్‌లో తక్కువగా కనిపిస్తారు. కానీ పునీత్ రాజ్‌కుమార్ మాత్రం ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడుపుతారని తాజాగా వైరల్ అవుతున్న తన జిమ్ వీడియోలు చూస్తే అర్థం అవుతోంది.
చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్..
కన్నడ సినీ పరిశ్రమలో పునీత్ రాజ్‌కుమార్.. ఎనర్జిటిక్ అండ్ చార్మింగ్ హీరోగా పేరు కూడా ఉంది. జిమ్‌లోనే కాదూ షూటింగ్ కోసం ఎక్కడికెళ్లినా వర్కౌట్స్ మాత్రం వదలరట. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. తాజాగా జేమ్స్ అనే సినిమాకు సైన్ చేసిన పునీత్.. ఇందులో బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నారట. ఇందుకోసం బాడీ బిల్డర్‌గా తనని తాను మేకోవర్ చేసుకునేందుకు జిమ్‌లో ఓవర్‌గా ఎక్స్‌ర్‌సైజులు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన జిమ్ సిబ్బంది, సహాయకులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ డేంజర్ స్ట్రోక్ పునీత్‌ను బలితీసుకుంది. భారత సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment