రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్, భార్య శ్రీదేవి భైరప్ప మధ్య విడాకుల గొడవ కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. భార్య శ్రీదేవితో విడిపోవడానికి జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను యువ రాజ్‌కుమార్ దాఖలు చేశాడు. దానిని ఖండించిన శ్రీదేవి తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.
తన భర్తకు కన్నడ హీరోయిన్ సప్తమిగౌడతో ఎఫైర్ ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో యువ రాజ్‌కుమార్ లాయర్ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలే చేశాడు. మరోక వ్యక్తితో శ్రీదేవికి సంబంధం ఉందని, ఆస్తి కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఆయన తెలిపాడు.
కోర్టును ఆశ్రయించిన సప్తమిగౌడ
శ్రీదేవిపై కాంతార నటి సప్తమిగౌడ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్‌కుమార్ కేసులో తన పేరు ప్రస్తావిస్తూ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సప్తమిగౌడ బెంగళూరు సిటీ సివిల్‌కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమె పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని జడ్జి ఆదేశాలిచ్చారు. శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. యువ రాజ్‌కుమార్ కాపురంలో కలతలకు నటి సప్తమిగౌడ కారణమని శ్రీదేవి ఆరోపిస్తోంది.
'యువ' సినిమాలో సప్తమిగౌడతో యువ రాజ్‌కుమార్ కలిసి నటించారు. ఈ సినిమా 2024 మార్చి ఆఖరులో విడుదలై మిశ్రమ ఫలితాల్ని చవిచూసింది. కానీ భారీగా వసూళ్లను రాబట్టింది. యువ రాజ్‌కుమార్, సప్తమి మధ్య అపైర్ ఉందని శ్రీదేవి ఆరోపించింది. ఇద్దరిని హోటల్ రూమ్‌లో చూశానని చెబుతోంది. ఇది సప్తమిగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో కోర్టును ఆశ్రయించింది.
దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే. వీరిలో రాఘవేంద్ర కుమారుడే యువ రాజ్‌కుమార్. అయితే, ఈ వివాదంపై శివ రాజ్‌కుమార్ ఎలాంటి కామెంట్ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment