Sapthami Gowda
-
గ్లామర్ డోస్ పెంచిన..కాంతార బ్యూటీ సప్తమిగౌడ లేటెస్ట్ ఫొటోస్
-
'కాంతార' బ్యూటీ.. షార్ట్‌లో భలే అందంగా ఉంది! (ఫొటోలు)
-
నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్, భార్య శ్రీదేవి భైరప్ప మధ్య విడాకుల గొడవ కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. భార్య శ్రీదేవితో విడిపోవడానికి జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను యువ రాజ్‌కుమార్ దాఖలు చేశాడు. దానిని ఖండించిన శ్రీదేవి తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్తకు కన్నడ హీరోయిన్ సప్తమిగౌడతో ఎఫైర్ ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో యువ రాజ్‌కుమార్ లాయర్ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలే చేశాడు. మరోక వ్యక్తితో శ్రీదేవికి సంబంధం ఉందని, ఆస్తి కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఆయన తెలిపాడు.కోర్టును ఆశ్రయించిన సప్తమిగౌడశ్రీదేవిపై కాంతార నటి సప్తమిగౌడ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్‌కుమార్ కేసులో తన పేరు ప్రస్తావిస్తూ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సప్తమిగౌడ బెంగళూరు సిటీ సివిల్‌కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమె పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని జడ్జి ఆదేశాలిచ్చారు. శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. యువ రాజ్‌కుమార్ కాపురంలో కలతలకు నటి సప్తమిగౌడ కారణమని శ్రీదేవి ఆరోపిస్తోంది. 'యువ' సినిమాలో సప్తమిగౌడతో యువ రాజ్‌కుమార్ కలిసి నటించారు. ఈ సినిమా 2024 మార్చి ఆఖరులో విడుదలై మిశ్రమ ఫలితాల్ని చవిచూసింది. కానీ భారీగా వసూళ్లను రాబట్టింది. యువ రాజ్‌కుమార్, సప్తమి మధ్య అపైర్ ఉందని శ్రీదేవి ఆరోపించింది. ఇద్దరిని హోటల్ రూమ్‌లో చూశానని చెబుతోంది. ఇది సప్తమిగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో కోర్టును ఆశ్రయించింది.దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే. వీరిలో రాఘవేంద్ర కుమారుడే యువ రాజ్‌కుమార్. అయితే, ఈ వివాదంపై శివ రాజ్‌కుమార్ ఎలాంటి కామెంట్ చేయలేదు. -
నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే IPS అయ్యేదాన్ని: స్టార్ హీరోయిన్ (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంత అందంగా మారిన కాంతార హీరోయిన్ సప్తమి గౌడ (ఫొటోలు)
-
కాంతార బ్యూటీ సప్తమి గౌడ గురించి ఈ విషయాలు తెలుసా?
‘కాంతార’లో ప్రేక్షకులను ఆకర్షించిన నటి సప్తమి గౌడ. వరుస అవకాశాలతో స్టార్డమ్ వైపు పరుగెడుతున్న ఆమె పరిచయం క్లుప్తంగా.. సప్తమి స్వస్థలం బెంగళూరు. ఆమె చదువూ అక్కడే సాగింది. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడే పలుమార్లు స్టేట్, నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. నటన మీదున్న ఆసక్తితో .. అవకాశాల కోసం ముందు మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తొలిసారి కన్నడలో ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’తో వెండి తెరపై మెరిసింది. ఈ చిత్రంలో తన నటనకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్‌ను అందుకుంది. ‘కాంతార’తో ఊహించని విజయాన్ని సాధించిన సప్తమి.. తన యాక్టింగ్ డేట్స్ కోసం మూవీ చాన్స్‌లు పడిగాపులు పడే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ‘ద వ్యాక్సిన్ వార్’, ‘యువ’, ‘కాళి’, ‘కాంతార ప్రీక్వెల్’ తదితర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉంది. త్వరలోనే హీరో నితిన్ ‘తమ్ముడు’తో తెలుగులోనూ అలరించనుంది. ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటాను. శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు వర్క్ అవుట్స్ ఎక్కువగా చేస్తుంటాను. -సప్తమి గౌడ View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) చదవండి: సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరంటే..