‘కాంతార’లో ప్రేక్షకులను ఆకర్షించిన నటి సప్తమి గౌడ. వరుస అవకాశాలతో స్టార్‌డమ్ వైపు పరుగెడుతున్న ఆమె పరిచయం క్లుప్తంగా..
సప్తమి స్వస్థలం బెంగళూరు. ఆమె చదువూ అక్కడే సాగింది. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడే పలుమార్లు స్టేట్, నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. నటన మీదున్న ఆసక్తితో .. అవకాశాల కోసం ముందు మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తొలిసారి కన్నడలో ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’తో వెండి తెరపై మెరిసింది. ఈ చిత్రంలో తన నటనకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్‌ను అందుకుంది.
‘కాంతార’తో ఊహించని విజయాన్ని సాధించిన సప్తమి.. తన యాక్టింగ్ డేట్స్ కోసం మూవీ చాన్స్‌లు పడిగాపులు పడే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ‘ద వ్యాక్సిన్ వార్’, ‘యువ’, ‘కాళి’, ‘కాంతార ప్రీక్వెల్’ తదితర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉంది. త్వరలోనే హీరో నితిన్ ‘తమ్ముడు’తో తెలుగులోనూ అలరించనుంది.
ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటాను. శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు వర్క్ అవుట్స్ ఎక్కువగా చేస్తుంటాను.
-సప్తమి గౌడ
చదవండి: సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరంటే..
Comments
Please login to add a commentAdd a comment