సుశాంత్‌ చివరి చిత్రం ట్రైలర్‌ అప్‌డేట్‌ | Sushant Singh Rajput Last Movie Dil Bechara Trailer Release Date Out | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ చివరి చిత్రం ట్రైలర్‌ అప్‌డేట్‌

Published Sun, Jul 5 2020 4:19 PM | Last Updated on Sun, Jul 5 2020 5:36 PM

Sushant Singh Rajput Last Movie Dil Bechara Trailer Release Date Out - Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరిగా నటించిన ‘దిల్‌ బేచారా’ ట్రైలర్‌ సోమవారం విడుదల కానుంది. ఇందకు సంబంధించి ఆ చిత్ర బృందం సోషల్‌ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడిగా నటించిన సంజనా సంఘి కూడా ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి అని పేర్కొన్నారు. ఈ సినిమా ఒక అందమైన జర్నీ అని పేర్కొన్న సంజన.. మన్నీని(సుశాంత్‌) మిస్‌ అవుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ చిత్రం జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది.(చదవండి : ఆ సినిమాలను బాయ్‌కాట్‌ చేయండి)

సుశాంత్‌ సన్నిహితుడు ముఖేష్‌ చబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌ గ్రీన్‌ రచించిన ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంజన, సైఫ్‌ అలీఖాన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందించారు. గతంలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అయితే ఈలోపే సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడం అందరిని షాక్‌కు గురిచేసింది. (చదవండి : సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement