Mukesh Chhabra
-
ఇలా మధ్యలో ఉండేవారి వల్ల కెరీర్ నాశనం: దర్శకుడు
ఎంతోమంది కెరీర్‌ను మధ్యలో ఉన్నవాళ్లే నాశనం చేస్తున్నారంటున్నాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కొందరు మేనేజర్ల వల్ల ఆ హీరోల కెరీర్ ప్రమాదంలో పడుతుందని చెప్తున్నాడు. ఇంతకీ ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే.. కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా... ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదీ పరిస్థితి.. ఒక్క నటుడు, 200మంది కాస్టింగ్ డైరెక్టర్లు, 15,680 మేనేజర్లు అని (దండంరా నాయనా అన్నట్లుగా ఓ ఎమోజీ జత చేసి) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.మేనేజర్ చేసిన పనికి..దీనికి వివేక్ స్పందిస్తూ.. అవును, ఓ మేనేజర్ దురుసు ప్రవర్తన వల్ల గతవారం ఓ ప్రముఖ నటుడిని సినిమాలో నుంచి తీసేయాల్సి వచ్చింది. ఆ మేనేజర్ ఓ పెద్ద స్టార్ కిడ్ టాలెంట్ ఏజెన్సీలో పని చేస్తాడు. అందుకని అంత ఓవర్‌గా ప్రవర్తించాల్సిన అవసరం లేదుకదా!దీని గురించి వర్క్షాప్వీళ్ల వల్ల ఎంతోమంది కెరీర్ నాశనమవుతున్నాయి. దీని గురించి వర్క్‌షాప్ నిర్వహించాల్సిందంటూ ముకేశ్ చాబ్రాను కోరాడు. అయితే నటుడు, మేనేజర్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి.. ద ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా చేస్తున్నాడు. I had to fire a lead actor last week because his manager was so arrogant and behaved as if he had the prerogative to be like this just because he is an employee of a ‘Huge Celeb’s’ Star Kid Talent Agency’. These middlemen have destroyed more careers than made it. Do a workshop… https://t.co/r3RtDtyBBu— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 27, 2024 చదవండి: దేవర సినిమా రివ్యూ -
విరాట్ కోహ్లి గొప్ప నటుడు, కానీ సినిమాల్లోకి రావొద్దు!
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మంచి నటుడే కానీ సినిమాల్లోకి మాత్రం రావొద్దంటున్నాడు కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముకేశ్ చాబ్రా. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చే సాహసం చేయొద్దని సూచిస్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ముకేశ్ చాబ్రా మాట్లాడుతూ.. కోహ్లి గొప్ప నటుడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ పంజాబీ మనిషి జీవితాన్ని చదివేశాడు. విజయాన్ని ఎంతో నేర్పుగా అదిమిపట్టుకున్నాడు. సినిమాల్లోకి వద్దులుక్స్, ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం.. అన్నింటిపైనా శ్రద్ధ తీసుకున్నాడు. తను గొప్పవాడు, తెలివైనవాడు. అలాగే ఎంతో సరదాగా ఉంటాడు. డ్యాన్స్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. కోహ్లి కామెడీ టైమింగ్ కూడా భలే ఉంటుంది. ఇతడు మన దేశం గర్వపడే స్థాయికి ఎదిగాడు. అతడికి పేరు తెచ్చిపెట్టిన క్రీడారంగంలోనే ఆయన కొనసాగాలి తప్ప సినిమాల్లోకి రాకూడదు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోతేనే బెటర్ అని అభిప్రాయపడ్డాడు.యాడ్స్ వరకే..కాగా విరాట్ కోహ్లి ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. కొన్నింటిలో భార్య, హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి యాక్ట్ చేశాడు. అయితే యాడ్స్ వరకే పరిమితమైపోయాడు. ఎన్నడూ సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేయలేదు.చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు -
‘నెల గడిచింది.. ఒక్క ఫోన్ కాల్ రాలేదు’
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నేటికి(జూలై 14) నెల రోజులు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సుశాంత్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలంతా సోషల్ మీడయా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అంతేగాక సుశాంత్‌తో వారికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భావోద్యేగానికి లోనవుతున్నారు. అదే విధంగా సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ దర్శకుడు, స్నేహితుడు ముఖేష్ చబ్రా సుశాంత్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ‘దిల్ బెచారా’ షూటింగ్ సెట్స్‌లో సుశాంత్‌తో కలిసి సందడి చేసిన ఫొటోలను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘నెల రోజుల గడుస్తోంది... కానీ నీ నుంచి ఇంతవరకు ఒక్క ఫోన్‌కాల్ కూడా రాలేదు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను: సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ View this post on Instagram एक महीना हो गया है आज 😞 ‘’अब तो कभी फ़ोन भी नहीं आएगा तेरा ‘’ A post shared by Mukesh Chhabra CSA (@castingchhabra) on Jul 13, 2020 at 7:19pm PDT ‘దిల్ బేచారా’లో సుశాంత్ సహనటి స్వస్థిక ముఖర్జీ సైతం ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో సుశాంత్, స్వస్తికలు సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ‘సుశాంత్‌ను కలుసుకున్న రోజులు ఎప్పటికీ ప్రత్యేకమైనవి’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర మానసిక ఒత్తిడితో అతడు ఆత్మహత్య పాల్పడినట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. View this post on Instagram HE danced with #kizie and then HE danced with me :-) . . I’d like to remember Sushant like this. Always. Simple. Fun loving. Jovial. Keep dancing with the stars, boy. Love. Thank you, Mukesh @castingchhabra for capturing this beautiful moment. I will cherish this forever. . . #dilbechara #behindthescenes #momentstocherish #joyfultimes #aftershoot #sushantsinghrajput #shineon A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) on Jul 12, 2020 at 5:24am PDT -
సుశాంత్ చివరి చిత్రం ట్రైలర్ అప్డేట్
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరిగా నటించిన ‘దిల్ బేచారా’ ట్రైలర్ సోమవారం విడుదల కానుంది. ఇందకు సంబంధించి ఆ చిత్ర బృందం సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడిగా నటించిన సంజనా సంఘి కూడా ట్రైలర్ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి అని పేర్కొన్నారు. ఈ సినిమా ఒక అందమైన జర్నీ అని పేర్కొన్న సంజన.. మన్నీని(సుశాంత్) మిస్ అవుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ చిత్రం జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్స్క్రిప్షన్ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది.(చదవండి : ఆ సినిమాలను బాయ్‌కాట్ చేయండి) సుశాంత్ సన్నిహితుడు ముఖేష్ చబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ గ్రీన్ రచించిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంజన, సైఫ్ అలీఖాన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. గతంలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈలోపే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడం అందరిని షాక్‌కు గురిచేసింది. (చదవండి : సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) View this post on Instagram Kizie is just so incomplete without Manny. This, is one of my favourite shots, so surreal and dreamlike✨The #DilBechara trailer will be out tomorrow. You all? Just stay tuned! 🙏 #SushantSinghRajput @castingchhabra #SaifAliKhan @arrahman @shashankkhaitan @swastikamukherjee13 @sahilvaid24 @saswatachatterjeeofficial @suprotimsengupta @amitabhbhattacharyaofficial @foxstarhindi @disneyplushotstarvip @sonymusicindia @mukeshchhabracc A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jul 5, 2020 at 1:30am PDT -
సుశాంత్ చివరి చిత్రం.. ఫ్రీగా చూడొచ్చు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేటికీ ఆయన అభిమానులు సుశాంత్‌ను తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. ఇక సుశాంత్ చివరిసారిగా నటించిన "దిల్ బేచారా" చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. ఇది "ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్"కు రీమేక్. తాజాగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా "ప్రేమ, ఆశ, అంతులేని జ్ఞాపకాల సమూహారమే ఈ కథ. సుశాంత్ నటించిన ఈ సినిమా అందరి మనసులో చిరస్థాయిగా నిలుస్తుంది" అంటూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ట్వీట్ చేసింది. క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ సరసన సంజనా సాంఘి నటించింది. ఈ సినిమా అందరూ ఉచితంగా చూడొచ్చని సంజనా పేర్కొంది. (సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?) దర్శకుడు ముఖేశ్ మాట్లాడుతూ.. "సుశాంత్ నా సినిమాలో హీరోనే కాదు, నా స్నేహితుడు కూడా. 'కాయ్ కో పీచే' నుంచి 'దిల్ బేచారా' వరకు అతనేంటో నాకు తెలుసు. నేను దర్శకత్వం వహించే తొలి సినిమాలో అతను నటిస్తాడని నాకు మాటిచ్చాడు. మేమిద్దరం ఎన్నో కలలు కన్నాం, మరెన్నో ప్లాన్లు వేసుకున్నాం. కానీ అవన్నీ అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు ఒంటరిగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా" అని భావోద్వేగానికి లోనయ్యాడు. సుశాంత్ గత చిత్రం 'డ్రైవ్'ను నిర్మాత కరణ్ జోహార్ ఓటీటీలోనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆఖరు చిత్రాన్నైనా థియేటర్లో విడుదల చేయాలని అభిమానులు కోరినప్పటికీ నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపారు. (అమ్మా.. మన ఇద్దరం తప్పనుకుంటా: సుశాంత్) -
రెహమాన్ సినిమా తొలి పోస్టర్ వచ్చేసింది!
ముంబై: ఆస్కార్ విన్నర్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత మరో కీలక అడుగు ముందుకేశారు. తన సంగీతంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆయన చిత్ర నిర్మాణ రంగంలో తన మొదటి చిత్రం పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీత ప్రధాన కథాంశంతో కూడిన ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో 99 పాడల్గళ్ పేరుతో, హిందీలో 99 సాంగ్స్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తొలి పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కలర్ ఫుల్ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అందరి ఆశీస్సులను ఆకాంక్షించారు. '' మీ అందరి సహకారం, ఆశీస్సులతో .. నా సినిమా మొదటి పోస్టర్.. షేర్ చేస్తున్నా' అని ఆయన ట్వీట్ చేశారు అటు ఈ సినిమా దర్శకుడు ముఖేస్ చాబ్రా కూడా ఈ పోస్టర్ ను తన ట్విట్టర్ పోస్ట్ చేశారు. రెహమాన్ చిత్రంలో భాగస్వామి కావడం తనకు గొప్ప అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు. కాగా ఏఆర్ రెహమాన్ వైఎంసీ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి తమిళ్, హిందీ భాషలలో తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థ ద్వారా భవిష్యత్ లో కొత్త సంగీత దర్శకు లను ప్రోత్సహిస్తానని ప్రకటించారు. అరుదైన ప్రతిభతో రెండు అస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక భారతీయుడు ఏఆర్ రెహమాన్ అటు హాలీవుడ్లో కూడా తన హవాను చాటుకుంటున్నారు. With your support & good wishes, I'm pleased to share my movie's first poster! https://t.co/F7KOZ0bRmv — A.R.Rahman (@arrahman) March 9, 2016