ఎంతోమంది కెరీర్‌ను మధ్యలో ఉన్నవాళ్లే నాశనం చేస్తున్నారంటున్నాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కొందరు మేనేజర్ల వల్ల ఆ హీరోల కెరీర్ ప్రమాదంలో పడుతుందని చెప్తున్నాడు. ఇంతకీ ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే.. కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా... ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదీ పరిస్థితి.. ఒక్క నటుడు, 200మంది కాస్టింగ్ డైరెక్టర్లు, 15,680 మేనేజర్లు అని (దండంరా నాయనా అన్నట్లుగా ఓ ఎమోజీ జత చేసి) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు.
మేనేజర్ చేసిన పనికి..
దీనికి వివేక్ స్పందిస్తూ.. అవును, ఓ మేనేజర్ దురుసు ప్రవర్తన వల్ల గతవారం ఓ ప్రముఖ నటుడిని సినిమాలో నుంచి తీసేయాల్సి వచ్చింది. ఆ మేనేజర్ ఓ పెద్ద స్టార్ కిడ్ టాలెంట్ ఏజెన్సీలో పని చేస్తాడు. అందుకని అంత ఓవర్‌గా ప్రవర్తించాల్సిన అవసరం లేదుకదా!
దీని గురించి వర్క్‌షాప్
వీళ్ల వల్ల ఎంతోమంది కెరీర్ నాశనమవుతున్నాయి. దీని గురించి వర్క్‌షాప్ నిర్వహించాల్సిందంటూ ముకేశ్ చాబ్రాను కోరాడు. అయితే నటుడు, మేనేజర్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి.. ద ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా చేస్తున్నాడు.
I had to fire a lead actor last week because his manager was so arrogant and behaved as if he had the prerogative to be like this just because he is an employee of a ‘Huge Celeb’s’ Star Kid Talent Agency’. These middlemen have destroyed more careers than made it. Do a workshop… https://t.co/r3RtDtyBBu
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 27, 2024
చదవండి: దేవర సినిమా రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment