![Dil Bechara Director Mukesh Chhabra Heart Felt Note On Sushant Death - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/14/sushant.jpg.webp?itok=aAY74YmS)
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నేటికి(జూలై 14) నెల రోజులు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సుశాంత్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలంతా సోషల్ మీడయా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అంతేగాక సుశాంత్‌తో వారికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భావోద్యేగానికి లోనవుతున్నారు. అదే విధంగా సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ దర్శకుడు, స్నేహితుడు ముఖేష్ చబ్రా సుశాంత్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ‘దిల్ బెచారా’ షూటింగ్ సెట్స్‌లో సుశాంత్‌తో కలిసి సందడి చేసిన ఫొటోలను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘నెల రోజుల గడుస్తోంది... కానీ నీ నుంచి ఇంతవరకు ఒక్క ఫోన్‌కాల్ కూడా రాలేదు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను: సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్
‘దిల్ బేచారా’లో సుశాంత్ సహనటి స్వస్థిక ముఖర్జీ సైతం ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో సుశాంత్, స్వస్తికలు సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ‘సుశాంత్‌ను కలుసుకున్న రోజులు ఎప్పటికీ ప్రత్యేకమైనవి’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర మానసిక ఒత్తిడితో అతడు ఆత్మహత్య పాల్పడినట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment