స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మంచి నటుడే కానీ సినిమాల్లోకి మాత్రం రావొద్దంటున్నాడు కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముకేశ్ చాబ్రా. రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చే సాహసం చేయొద్దని సూచిస్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ముకేశ్ చాబ్రా మాట్లాడుతూ.. కోహ్లి గొప్ప నటుడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ పంజాబీ మనిషి జీవితాన్ని చదివేశాడు. విజయాన్ని ఎంతో నేర్పుగా అదిమిపట్టుకున్నాడు.
సినిమాల్లోకి వద్దు
లుక్స్, ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యం.. అన్నింటిపైనా శ్రద్ధ తీసుకున్నాడు. తను గొప్పవాడు, తెలివైనవాడు. అలాగే ఎంతో సరదాగా ఉంటాడు. డ్యాన్స్ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు. కోహ్లి కామెడీ టైమింగ్ కూడా భలే ఉంటుంది. ఇతడు మన దేశం గర్వపడే స్థాయికి ఎదిగాడు. అతడికి పేరు తెచ్చిపెట్టిన క్రీడారంగంలోనే ఆయన కొనసాగాలి తప్ప సినిమాల్లోకి రాకూడదు. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోతేనే బెటర్ అని అభిప్రాయపడ్డాడు.
యాడ్స్ వరకే..
కాగా విరాట్ కోహ్లి ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. కొన్నింటిలో భార్య, హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి యాక్ట్ చేశాడు. అయితే యాడ్స్ వరకే పరిమితమైపోయాడు. ఎన్నడూ సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment