Shiva Rajkumar Watches Puneeth Rajkumar Last Film James In Mysuru: దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' గురువారం ఆయన జన్మదినం సందర్భంగా విడుదలైంది. ఉదయం ఆరు గంటల నుంచే అభిమానులు థియేటర్ల వద్ద గుమిగూడారు. కొందరు తెరపై పునీత్‌ను చూసి నృత్యం చేయగా మరి కొందరు విలపించారు. పవర్ స్టార్ 47వ పుట్టిన రోజును అభిమానులు ఒక పండుగలా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో సినిమా విడుదలైంది.చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ
పునీత్ తెరపై కనపడగానే అభిమానుల ఈలలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయ్యాయి. మైసూరులో ఒక థియేటర్‌లో పునీత్ పెద్దన్న, నటుడు శివరాజ్‌కుమార్ సినిమాను చూశారు.ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు.
ఫిలిం సిటీకి పునీత్ పేరు పెడితే సంతోషం
మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో నిర్మిస్తున్న ఫిలిం సిటీకి తన తమ్ముడు, దివంగత పునీత్ రాజ్‌కుమార్ పేరు పెడితే సంతోషిస్తామని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. పునీత్ లేకుండా అతని పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో బాధగా ఉందని, ఇప్పటికీ తమ కుటుంబం అప్పు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట
Comments
Please login to add a commentAdd a comment