Columbia Asia Hospital
-
ఏకంగా ఆమె చెవిలో మకాం వేసింది...
సాధారణంగా సాలీడు ఏ చెట్టుకో, ఇళ్లల్లోనో బూజు గూళ్లు అల్లుకునే విషయాన్ని మనం చూసి ఉంటాం. అయితే ఈ సాలీడు మాత్రం తన రూట్ మార్చి ఏకంగా ఓ మహిళ చెవిలోనే మకాం వేసింది. అంతే కాకుండా ఆమె తన ప్రాణం పోతుందేమో అనుకునేలా చేసింది. తీవ్రమైన తలనొప్పితో బాధిత మహిళ ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి బతికున్న సాలీడును ఆమె చెవిలో గుర్తించారు. బెంగళూరుకు చెందిన 49 ఏళ్ల లక్ష్మి అనే మహిళకు మధ్యాహ్నం లేవగానే భరించలేని తలనొప్పితో పాటు తన కుడి చెవిలో ఏదో ఉన్నట్లు అనిపించింది. చెవిలో ఏదో తిరుగుతున్నట్లుగా అనిపించడంతో... ఆమె చెవిని పలుసార్లు రుద్దుకుని, చెవిలో ఉన్నదాన్ని తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా తలనొప్పి అంతకంతకు తీవ్రతరం కావడంతో కొలంబియా ఏషియా ఆస్పత్రికి వెళ్లిన ఆమెను డాక్టర్ పరీక్షించిన చెవిలో సాలీడు ఉన్నట్లు గుర్తించారు. అయితే లక్ష్మి చెవిపై టార్చ్ లైట్ వేయగానే ఆ వెలుగుకు సాలె పురుగు పాక్కుంటూ దానికదే చెవిలో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో షాక్ తినడం డాక్టర్ వంతైంది. ఈ సందర్భంగా లక్ష్మిని పరీక్షించిన ఈఎన్టీ డాక్టర్ సంతోష్ శివస్వామి మాట్లాడుతూ .... చెవిలో దూరిన సాలీడు బతికి ఉండటం తాము తొలిసారి చూశామని, ఇది అరుదైన ఘటన అని అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. -
కొడగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై కాల్పులు
మైసూరు కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలింపు కోలుకుంటున్న సుజా కుశాలప్ప ఎదురు కాల్పులు జరిపిన కుమారుడు దుండగుల కోసం ప్రత్యేక బృందాలు బెంగళూరు, న్యూస్‌లైన్ : రాజకీయ వైరం కారణంగా కొడగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై దుండగులు రివాల్వర్‌తో కాల్పులు జరిపిన సంఘటన వీరాజపేటలో గురువారం జరిగింది. క్షతగాత్రుడు సుజా కుశాలప్ప గొంతు, మరో రెండుచోట్ల బుల్లెట్లు దూసుకెళ్లాయి. వీరాజపేటలో ప్రథమ చికిత్స అనంతరం ఆయన్ను మైసూరుకు తరలించారు. కొడగు జిల్లా కేంద్రంలోని మడికెరీలో అఖిల భారత సాహిత్య సమ్మేళనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఆ కార్యక్రమంపై దృష్టి సారించింది. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థులు రెచ్చిపోయారు. రాజకీయవైరంతో కాల్పులు జరిపిన సంఘటన జిల్లాలో ఇదే ప్రథమం. కొడగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సుజా కుశాలప్ప స్వయానా మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే (మడికేరి) అప్పచ్చు రంజన్ సోదరుడు. గురువారం సాయంత్రం సుజా కుశాలప్ప తన కుమారుడు శశాంక్ తదితరులతో వీరాజపేటలోని తన కార్యాలయంలో ఉన్నాడు. అదే సమయంలో కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు క్షణాల్లో కాల్పులు జరిపి పరారయ్యారు. దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో కుశాలప్ప శరీరంలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. కుమారుడు శశాంక్ తేరుకుని కారులో పరారవుతున్న దుండగులపై ఎదురు కాల్పులు జరిపా డు. సహచరులు కుశాలప్పను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అన ంతరం మైసూరుకు తరలించారు. రాజకీయవైరంతోనే కుశాలప్ప పై హత్యాయత్నం జరిగిందని, మాజీ స్పీకర్, వీరాజపేట ఎమ్మెల్యే కే.జీ. బోప్పయ్య ఆరోపించారు. దుండగులు తనపై కూడా కాల్పులు జరపడానికి యత్నించారని శశాంక్ తెలిపాడు. పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలుసేకరించారు. రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆత్మరక్షణ కోసం శశాంక్ కాల్పులు జరిపినట్లు కొడగు ఎస్పీ అనుజిత్ మీడియాకు వివరించారు. -
నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కు అస్వస్థత!
కన్నడ నటుడు, నిర్మాత రాఘవేంద్ర రాజ్ కుమార్ అనారోగ్య కారణంతో ఆస్పత్రిలో చేరారు. రాఘవేంద్ర ప్రముఖ నటుడు, దివంగత రాజ్ కుమార్ కుమారుడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టు సన్నిహితులు తెలిపారు. రాఘవేంద్ర రాజ్ కుమార్ బుధవారం ఉదయం 9.15 నిమిషాలకు ఆస్పత్రిలో చేర్పించారని..ఆయనకు చికిత్సనందిస్తున్నామని కొలంబియా ఆసియా ఆస్పత్రిలోని వైద్యులు డాక్టర్ మేధ హూల్గోల్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన రాఘవేంద్రకు వైద్యుల బృందం వెంటనే చికిత్సను అందించారని.. త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. మెదడులో రక్తం గడ్గకట్టింది. వైద్యులు చికిత్స చేసి తొలగించారు అని రాఘవేంద్ర సోదరుడు శివరాజ్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రాఘవేంద్ర పరిస్థితి మెరుగు పడిందని శివరాజ్ అన్నారు. ఉదయం జాగింగ్ చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి తరలించామని శివరాజ్ తెలిపారు.