
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'భైరతి రణగల్' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీని దర్శకుడు నర్తన్ తెరకెక్కిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే, ఇప్పటికే ఈ సినిమా కన్నడలో నవంబర్ 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా విడుదల కానుంది. నవంబర్ 29న తెలుగుతో పాటు తమిళ్‌లో రిలీజ్ కానుంది.
గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్' చిత్రాన్ని నిర్మించారు. 2017లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన మఫ్తీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. శివరాజ్ కుమార్‌కు టాలీవుడ్‌లో కూడా మార్కెట్ ఉండటంతో ఆయన చిత్రాలు ఇక్కడ విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో 'భైరతి రణగల్' తెలుగు ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment