‘జస్టిస్ చౌదరి’తో సంబంధం లేదు | No relavance with Justice chowdary getup, says Rajkumar | Sakshi
Sakshi News home page

‘జస్టిస్ చౌదరి’తో సంబంధం లేదు

Published Wed, Sep 18 2013 12:56 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

‘జస్టిస్ చౌదరి’తో సంబంధం లేదు - Sakshi

‘జస్టిస్ చౌదరి’తో సంబంధం లేదు

 ‘‘ఇందులో నేను ద్విపాత్రాభినయంలో కనిపిస్తాను. సిగార్ పైప్ తాగుతూ దర్పాన్ని ప్రదర్శించే శంకర్ నారాయణ్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలామంది జస్టిస్ చౌదరి గెటప్‌లా ఉందంటున్నారు. ఆ సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. నేను బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ అభిమానిని. ‘త్రిశూల్’ సినిమాలో ఆయన గెటప్ అంటే చాలా ఇష్టం. 
 
 ఆ సినిమా స్ఫూర్తితోనే ఈ గెటప్ వేశాను’’ అని రాజ్‌కుమార్ చెప్పారు. ఆయన కథానాయకుడిగా నృత్యదర్శకురాలు తార దర్శకత్వంలో రూపొందిన ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘సినిమాలతోనే తొలుత నా ప్రయాణం మొదలైంది. 
 
 తర్వాత బుల్లితెరపై బిజీ అయ్యాను. అయినా సినిమాపై మక్కువ పోలేదు. అందుకే హీరోగా నా రీఎంట్రీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను’’ అని తెలిపారు. కథలో ప్రాధాన్యతను బట్టి కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమని ఆయన వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement