Barrister Shankar Narayan
-
‘జస్టిస్ చౌదరి’తో సంబంధం లేదు
‘‘ఇందులో నేను ద్విపాత్రాభినయంలో కనిపిస్తాను. సిగార్ పైప్ తాగుతూ దర్పాన్ని ప్రదర్శించే శంకర్ నారాయణ్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలామంది జస్టిస్ చౌదరి గెటప్‌లా ఉందంటున్నారు. ఆ సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. నేను బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ అభిమానిని. ‘త్రిశూల్’ సినిమాలో ఆయన గెటప్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా స్ఫూర్తితోనే ఈ గెటప్ వేశాను’’ అని రాజ్‌కుమార్ చెప్పారు. ఆయన కథానాయకుడిగా నృత్యదర్శకురాలు తార దర్శకత్వంలో రూపొందిన ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘సినిమాలతోనే తొలుత నా ప్రయాణం మొదలైంది. తర్వాత బుల్లితెరపై బిజీ అయ్యాను. అయినా సినిమాపై మక్కువ పోలేదు. అందుకే హీరోగా నా రీఎంట్రీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను’’ అని తెలిపారు. కథలో ప్రాధాన్యతను బట్టి కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమని ఆయన వెల్లడించారు. -
‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ పాటలు
‘‘రాజ్‌కుమార్‌ని ‘అమ్మ రాజీనామా’ సినిమాతో నేనే హీరోని చేశాను. తారను నృత్య దర్శకురాలిగా పరిచయం చేసిందీ నేనే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. రాజ్‌కుమార్ మధ్యలో టీవీ సీరియళ్ల వైపుకు వెళ్లినా, చివరకు మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. రాజ్‌కుమార్ హీరోగా నృత్య దర్శకురాలు తార దర్శకత్వంలో రమా రాజ్‌కుమార్ సమర్పణలో వి.వి.రాజ్‌కుమార్ నిర్మిస్తోన్న ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ పాటల సీడీని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించారు. రాజ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘సినిమాల్లో నాకు జన్మనిచ్చింది దాసరిగారు. నా భార్య ప్రోత్సాహంతో ఈ సినిమా తీశాను. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. క్లైమాక్స్‌లో జడ్జిగా నటించానని తులసీరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో తార, ఎన్.శంకర్, ఎన్వీఎస్ రెడ్డి, నీలకంఠ, ప్రభు తదితరులు మాట్లాడారు.