‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ పాటలు
‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ పాటలు
Published Wed, Sep 4 2013 1:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
‘‘రాజ్‌కుమార్‌ని ‘అమ్మ రాజీనామా’ సినిమాతో నేనే హీరోని చేశాను. తారను నృత్య దర్శకురాలిగా పరిచయం చేసిందీ నేనే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. రాజ్‌కుమార్ మధ్యలో టీవీ సీరియళ్ల వైపుకు వెళ్లినా, చివరకు మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు’’ అని దాసరి నారాయణరావు చెప్పారు.
రాజ్‌కుమార్ హీరోగా నృత్య దర్శకురాలు తార దర్శకత్వంలో రమా రాజ్‌కుమార్ సమర్పణలో వి.వి.రాజ్‌కుమార్ నిర్మిస్తోన్న ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ పాటల సీడీని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించారు. రాజ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘సినిమాల్లో నాకు జన్మనిచ్చింది దాసరిగారు.
నా భార్య ప్రోత్సాహంతో ఈ సినిమా తీశాను. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. క్లైమాక్స్‌లో జడ్జిగా నటించానని తులసీరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో తార, ఎన్.శంకర్, ఎన్వీఎస్ రెడ్డి, నీలకంఠ, ప్రభు తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement