బారిష్టర్ శంకర్‌నారాయణ్
‘‘తన వాగ్దాటితో ఎంతటివారినైనా బోల్తా కొట్టించగల న్యాయవాది శంకర్‌నారాయణ్. ఆయనో కేసు టేకప్ చేస్తే, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే. అలాంటి బారిష్టర్ జీవితంలో ఓ కేసు మూలంగా ఏర్పడిన మలుపులే ఈ సినిమా నేపథ్యం’’ అని దర్శకురాలు తార చెప్పారు.
రాజ్‌కుమార్ హీరోగా నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవీ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి రామారాజ్‌కుమార్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘బారిష్టర్ శంకర్‌నారాయణ్’. వచ్చే నెల 2న పాటల్ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమా తనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని రాజ్‌కుమార్ తెలిపారు.
అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాకేత్, కెమెరా: ముప్పాళ్ల మహేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎల్.వేణుగోపాల్.