రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం | Movie Industry React Sakshi Article on Director Rajkumar And Help | Sakshi
Sakshi News home page

రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

Published Sat, Nov 16 2019 10:04 AM | Last Updated on Sat, Nov 16 2019 3:58 PM

Movie Industry React Sakshi Article on Director Rajkumar And Help

రాజ్‌కుమార్‌కు ఆర్థిక సహాయం అందజేస్తున్న సురేష్‌రెడ్డి , కిరణ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం అందింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడ్డారని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘సాక్షి’ శుక్రవారం ‘పునాదిరాళ్లకు పుట్టెడు కష్టం’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం విదితమే. దీనికి ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి స్పందించారు. తార్నాకలో ఉంటున్న దర్శకుడి దగ్గరకు వెళ్లి రూ.41వేలు అందజేశారు. 

‘మనం సైతం’ తరఫున...  
అదే విధంగా ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు. ‘మనం సైతం’ కుటుంబం నుంచి సాయం చేద్దామని ఆయన గ్రూపులో అభ్యర్థించగానే పలువురు నటులు, సినీ జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఆ మొత్తాన్ని కాదంబరి కిరణ్‌ స్వయంగా వెళ్లి రాజ్‌కుమార్‌కు ఇచ్చారు. స్పందించిన ప్రతి ఒక్కరికీ రాజ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement