తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రాజ్కుమార్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రాజ్కుమార్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించి సహచరులు వెంటనే కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ విఫలం కారణంగానే రాజ్కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సహచరులు పోలీసులకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.