చైన్స్నాచర్ శివ గ్యాంగ్ కేసులో మొత్తం ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: చైన్స్నాచర్ శివ గ్యాంగ్ కేసులో మొత్తం ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివ భార్య నాగలక్ష్మితో పాటు ముత్తూట్ ఫైనాన్స్ ఓంకార్ నగర్ బ్రాంచ్ మేనేజర్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ మేనేజర్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3.75 కేజీల బంగారం, రూ.4.5లక్షల నగదు, 2 కార్లు, బైక్తో పాటు విలువైన ఫర్నిచర్ను స్వాధీనం చేసుకున్నారు. శివ గ్యాంగ్పై సుమారు 700 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ సీవీ ఆనంద్ తెలిపారు. చైన్‌స్నాచర్ శివ ఆగస్ట్లో జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే.