Jagdish
-
టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గ టీడీపీలోని విభేదాలు రచ్చకెక్కాయి. ఇదే పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మూడు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన నేతలంతా తీర్మానం చేశారు. తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. వీరి వెనుక నియోజకవర్గానికి చెందిన కీలక నేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జిగా బోనెల విజయచంద్రను పార్టీ అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌లను విజయచంద్ర కలుపుకొని వెళ్లకుండా పూర్తిగా పక్కన పెట్టేశారని, సీనియర్లన్న గౌరవం లేకుండా వ్యవహరించేవారన్న విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. టీడీపీలో ఉంటూ సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారన్నది మరో ఆరోపణ. ఎన్నికలకు ముందు ఏ కార్యక్రమం చేపట్టినా ద్వారపురెడ్డి, బొబ్బిలి చిరంజీవులును బోనెల విజయచంద్ర ఆహ్వానించకుండా నిర్లక్ష్యం చేశారని జగదీష్ వర్గం చెబుతోంది. ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన విజయచంద్ర విజయం సాధించారు. ఆ తర్వాత పార్వతీపురంలో జరిగిన విజయోత్సవ సభలో ఆ సీనియర్ నేతలిద్దరూ హాజరు కాకపోవడం.. అదే వేదికపై పార్టీలో ఉంటూ ద్రోహం చేసిన వారిని ఉపేక్షించమని ఎమ్మెల్యే పరోక్షంగా హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ భేటీ.. ఇక్కడ సస్పెండ్‌కు తీర్మానంసీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఇటీవల మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గ టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. పార్టీకి అన్యాయం చేసి.. మరలా ఏ ముఖం పెట్టుకుని అధినేతను కలిసి వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పార్వతీపురం పట్టణంలో మూడు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ద్వారపురెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యే చిరంజీవులును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తామంతా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నట్లు వెల్లడించారు. సీతానగరం, బలిజిపేట, పార్వతీపురంలలో వారి అనుచరగణం కూడా పార్టీకి వ్యతిరేకంగా పని చేసిందని.. అందరినీ అధిష్టానం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఎంబీబీఎస్ సీటు రాక.. బీఏఎంఎస్‌లో వాట్సాప్‌లో ఫ్రెండ్‌కు మెసేజ్ పెట్టి..
వెంగళరావునగర్ (హైదరాబాద్): మానసిక ఒత్తిడి కారణంగా ఓ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా విఠలాపూర్ గ్రామానికి చెందిన జి.డి మాణిక్యప్ప వ్యవసాయం చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జగదీశ్ (23)కు చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలని కోరిక. ఈ క్రమంలో గత ఏడాది నీట్ ఎంట్రన్స్ రాశాడు. ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. వెంగళరావునగర్ డివిజన్ జవహర్‌నగర్‌లో తన స్నేహితుడు ఫణీంద్రతో కలిసి రూం తీసుకుని ఉంటున్నాడు. బీఏఎంఎస్ చేయడం ఇష్టం లేకపోవడంతో కళాశాలకు కూడా సరిగా వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ నుంచి బీఏఎంఎస్ పరీక్షలు జరుగుతున్నట్టు నోటీసు వచ్చింది. జగదీశ్ సరిగా కళాశాలకు హాజరు కాలేకపోవడంతో హాల్ టికెట్ పొందేందుకు ఇబ్బంది ఎదుర్కొన్నాడు. తనకు హాల్ టికెట్ ఇవ్వరేమో, పరీక్షలు రాయడానికి వీలుపడదేమో అనుకుని ఒత్తిడికి గురయ్యాడు. ఒకవైపు ఇష్టమైన ఎంబీబీఎస్ సీటు రాకపోవడం, మరోవైపు బీఏఎంఎస్ హాల్ టికెట్ ఇస్తారో లేదో అనే ఆందోళనతో జగదీశ్ మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఇదిలాఉండగా బుధవారం ఉదయం 7.30 గంటలకు జగదీశ్ రూంలో ఉంటున్న ఫణీంద్ర తన మరో స్నేహితుడైన రాజ్‌కుమార్ రూంకు వెళ్లాడు. జగదీశ్ 8.30 గంటల సమయంలో తన స్నేహితుడు అజయ్‌కు వాట్సాప్ ద్వారా తాను చనిపోతున్నట్టు మెసేజ్ పెట్టాడు. వెంటనే అజయ్ ఆందోళన చెంది ఫోన్ చేయగా, తాను చనిపోతున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. హుటాహుటిన అజయ్ తన స్నేహితుడు నవీన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే నవీన్, ఫణీంద్ర, ప్రశాంత్ కలిసి హుటాహుటిన జవహర్‌నగర్‌కు వచ్చి చూడగా గదిలో జగదీశ్ ఉరి వేసుకుని ఉన్నాడు. జగదీశ్‌ను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని తండ్రి మాణిక్యప్పకు తెలియజేయడంతో ఆయన హుటాహుటిన మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అరన్పూర్ పేలుళ్ల సూత్రధారి జగదీశ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంతెవాడ జిల్లా అరన్పూర్ బ్లాస్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు గుర్తించారు. పది మంది డీఆర్జీ కానిస్టేబుళ్లు, ఒక డ్రైవరు మరణించిన ఈ ఘటనకు జాగరగుండా తూర్పు గ్రామానికి చెందిన జగదీశ్ ప్రధాన కారకుడిని తేల్చారు. ఈ మేరకు దర్భా కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలిలా ఉన్నాయి. ప్రతీకారం కోసమే ఏప్రిల్ 12న దంతెవాడ జిల్లాలోని గొండెరాస్ పంచాయతీ పరిధిలో పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఇదే సందర్భంలో అక్కడున్న స్థానికులను భద్రతా దళాలు గట్టిగా బెదిరించాయి. గ్రామస్తుల ఎదుటే గాల్లోకి కాల్పులు జరిపారు. 17 మంది వృద్ధులు, పిల్లలను సైతం విచక్షణారహితంగా కొట్టినట్టు మావోయిస్టు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతికా ప్రకటన సైతం జారీ చేసింది. అయితే ఈ ఘటనపై ఎటువంటి పోలీసు కేసు నమోదు కాలేదు. కానీ గొండెరాస్లో స్థానికులపై భద్రతా దళాలు ప్రవర్తించిన తీరుతో మావోలు రగిలిపోయారు. దీంతో ప్రతీకారం కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలేమీ అడవుల్లో కూంబింగ్ కోసం డి్రస్టిక్ట్ రిజర్వ్గార్డ్స్తో పాటు సీఆర్పీఎఫ్ దళాలు ఈనెల 25న మంగళవారం అడవుల్లోకి వెళ్లాయి. ఒకరోజంతా అడవిలో కూంబింగ్ జరిపి మరుసటి రోజు ఏప్రిల్ 26న తిరుగు ప్రయాణం అయ్యారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు ప్రతీకారం ప్లాన్‌ను అమల్లో పెట్టినట్టు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో భద్రతా దళాలకు చెందిన సుమారు రెండు వందల మంది ఎనిమిది వాహనాల్లో సలేమీ అడవీ ప్రాంతం నుంచి దంతెవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే మావోయిస్టులు రోడ్డు కింద ముందుగానే ఐఈడీ అమర్చిన చోటులో రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టారు. దీంతో ఆ కర్రల దగ్గరకు రాగానే భద్రతా దళాలకు చెందిన వాహనాలు నెమ్మదించాయి. ఇదే అదనుగా మావోలు సుమారు 40 కేజీల ఐఈడీని పేల్చారు. పేలుడు ధాటికి మినీ బస్సు తునాతునకలైంది. వెంటనే అడవుల్లో మాటువేసి ఉన్న మావోయిస్టులు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఇరువైపులా నుంచి సుమారు 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలోనే దాడికి పాల్పడిన ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండు రోజులుగా వీరిని విచారించగా ఈ దాడికి పాల్పడింది జాగరగుండా తూర్పు గ్రామానికి చెందిన జగదీశ్‌గా వెల్లడైంది. జగదీశ్ తలపై రూ.5 లక్షలు జగదీష్ చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. పోలీసు రికార్డుల ప్రకారం గతంలో జగదీశ్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే భారీ దాడులను విజయవంతంగా అమలు చేస్తుండటంతో ఇటీవల పార్టీలో జగదీశ్ కేడర్ పెరిగింది. అలా కీలకమైన దర్బా డివిజన్‌కు వెళ్లాడు. మావోయిస్టుల సైనిక దళంలో ఇప్పుడు జగదీశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం జగదీష్‌పై ఐదు లక్షల రివార్డు ఉంది. అరన్పూర్ ఘటనలో జగదీశ్‌తో పాటు మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేశ్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముకేశ్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకే ష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరందరిపై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించారు. -
'చీజ్' బడీహై మస్త్ మస్త్!
అతనో మారుమూల పల్లె వాసి..బతుకుతెరువు కోసం పొట్ట చేతబట్టుకునిముంబైకి వలస వెళ్లాడు. కూలీగా మొదలుపెట్టి కాంట్రాక్టు పనులు చేసే స్థాయికి ఎదిగాడు. సుమారు 35 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న ఆయన.. సొంత గ్రామానికి క్రమం తప్పకుండా రాకపోకలు కొనసాగిస్తున్నాడు. తనకు పుట్టిన కుమారుడు అక్కడే పెరిగి పెద్దయినామానుకోలేదు. తండ్రి పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో సొంతూరులో ఏదైనా వ్యాపారం పెట్టాలని సంకల్పించాడు. వినూత్న ఆలోచనతో అమెరికా, దక్షిణ ఆఫ్రికా మేకల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మూడేళ్లలో చీజ్ ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇది..మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం సాలార్‌నగర్ గ్రామానికి చెందిన జగదీశ్ ఖలాల్ సక్సెస్ స్టోరీ. 30 నుంచి 300కు పైగా.. మేకలు పెంచాలన్న ఆలోచన రాగానే సాలార్నగర్లో తనకున్న ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఖలాల్ మొదట మామిడి, టేకు వంటి వివిధ రకాల మొక్కలు నాటాడు. ఆ తర్వాత మేకల ఉత్పత్తికి ప్రత్యేక షెడ్డు వేశాడు. అత్యధిక మాంసంతో పాటు పాలు ఇచ్చే అమెరికాకు చెందిన సానెన్, దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ జాతి మేకలను దిగుమతి చేసుకున్నాడు. 30 మేకలు, ఒక పొట్టేలుతో షెడ్డు ప్రారంభించాడు. మూడేళ్లలోనే జీవాల సంఖ్య 300కు పైగా పెరిగింది. పాలు అధికంగా ఇచ్చే సానెన్ రకానికి చెందిన మేక ఒక ఈతలో రెండు నుంచి మూడు పిల్లలకు జన్మనిస్తుంది. పిల్ల మేక మూడు నెలల్లోనే 30 కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఒక్కో మేక మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది. అత్యధికంగా మాంసాన్ని ఇచ్చే బోయర్ రకానికి చెందిన మేక కొంచెం పొట్టిగా ఉండి వెడల్పుగా పెరుగుతుంది. ఇది 14 నెలల్లో రెండు ఈతల్లో రెండు చొప్పున నాలుగు పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కో మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తుంది. ప్రత్యేక షెడ్.. దాణా.. మేకల కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేశారు. మేకలకు ఏ విధమైన హానీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేలపై పెంచకుండా మూడు, నాలుగడుగుల ఎత్తులో రంధ్రాలతో కూడిన ఫ్లోర్‌ను ఏర్పాటు చేశారు. రోగాలు సోకకుండా అత్యంత శుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెటర్నరీ వైద్యుల బృందం క్రమం తప్పకుండా వాటిని పర్యవేక్షిస్తోంది. దాణా కోసం మొక్కజొన్న పచ్చి మేతను టన్నుల లెక్కన బిహార్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం అన్ని రకాల పోషçకాలతో కూడిన దాణాను ఆహారంగా ఇస్తున్నారు. శుభ్రమైన నీటిని అందిస్తున్నారు. మధ్యాహ్నం సొంతంగా తయారుచేసిన జొన్న, మొక్కజొన్న కుడితి లాంటిది ఇస్తున్నారు. ఇలా రోజుకు మూడు పూటలు.. ఒక్కో మేకకు మొత్తంగా నాలుగు నుంచి ఆరు కిలోల దాణాను అందిస్తున్నారు. ఒక్క ఆవు పోషకంతో ఇలాంటి 10 మేకలను పెంచుకోవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సానెన్ మేక పాలతో నాణ్యమైన చీజ్.. ఈ మేకల పాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి పాలను చీజ్ తయారు చేసేందుకు, ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ప్రధానంగా సానెన్ రకానికి చెందిన మేకల పాలతో అత్యంత నాణ్యమైన చీజ్ తయారుచేసే అవకాశం ఉండడంతో ఇటీవలి కాలంలో ఈ జాతి పెంపకంపై దృష్టి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో మేక రెండు లీటర్ల చొప్పున పాలు ఇస్తున్నాయి. ఈ పాలను హైదరాబాద్‌కు తరలిస్తే లీటర్‌కు రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం పాలు పెద్ద మొత్తంలో లేకపోవడంతో స్థానిక పాలకేంద్రాల్లో లీటర్‌కు రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు షెడ్డు కాపలాదారు ఆంజనేయులు చెప్పాడు. బోయర్ విత్తన మేకపోతు రూ.3 లక్షలు బోయర్ జాతి మేక సుమారు 70 కిలోల నుంచి క్వింటా వరకు మాంసాన్ని ఇస్తుంది. అదే మేకపోతు అయితే 1.5 క్వింటా వరకు మాంసం ఇస్తుందని అంచనా. బోయర్ విత్తన మేకపోతు ధర రూ.3 లక్షల వరకు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వెయ్యి లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా.. మొత్తం వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తే.. అక్కడే చీజ్ మేకింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆ షెడ్డును కంపెనీయే తీసుకుని చీజ్ మేకింగ్ యూనిట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని జగదీశ్ ఖలాల్ తెలిపాడు. ఈ లెక్కన మేకల సంఖ్య కనీసం వెయ్యికి పెరగాల్సి ఉంటుందని, దీంతో వచ్చే మూడేళ్లలో వెయ్యి మేకల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు. వెయ్యి మేకలకు సరిపడా అన్ని రకాల ఏర్పాట్లతో షెడ్ నిర్మాణం చేస్తున్నామని, ఇలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదని పేర్కొన్నాడు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
వేప చెట్లకు ముప్పు..
సాక్షి, హైదరాబాద్: కొమ్మల ముడత లేదా డైబ్యాక్ అని పిలిచే విధ్వంసకర వ్యాధితో ప్రస్తుతం వేపచెట్లకు ముప్పున్నదని ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్లాంట్ పాథాలజిస్ట్ డా.జగదీశ్ తెలిపారు. ఇది అన్ని వయసులు, అన్ని పరిమాణాల వేప చెట్ల ఆకులు, కొమ్మలు, పుష్పగుచ్ఛాలను ప్రభావితం చేస్తుందని, ఐతే దీని వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనేంత బలంగా మన రాష్ట్రంలోని చెట్లున్నాయని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఆగస్టు–డిసెంబర్ల మధ్య ఎక్కువగా కనిపిస్తుందని, వర్షాకాలం మొదలయ్యాక లక్షణాలు కనిపిస్తాయని, వర్షాకాలం చివర్లో శీతాకాలంలో ఇది క్రమంగా తీవ్రమవుతుందని వివరించారు. విత్తన శుద్ధితో తగ్గుముఖం వేప విత్తనాలు విత్తే సమయంలో, శిలీంద్రనాశకాలు లేదా బయో నియంత్రిత ఏజెంట్లతో విత్తన శుద్ధి ఈ సంక్రమణను తగ్గిస్తుందని తెలియజేశారు. మొలక, నారు దశలో కార్బండాజిమ్ 2.5 గ్రాముల లీటరు నీరు లేదా ట్రైకోడెర్మా వంటి బయోకంట్రోల్ శిలీంద్రనాశకాల నివారణ స్ప్రేలు కచ్చితంగా నారు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనీ, వ్యాధులకు నిరోధకతను కల్పిస్తాయని తెలిపారు. వేప చెట్టు స్వాభావికంగా వ్యాధిని బాగా తట్టుకోగలుగుతుందని, తరచుగా ఫంగస్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయగలదని స్పష్టం చేశారు. దీనిపై తమ ఇన్స్టిట్యూట్ ల్యాబొరేటరీలో అధ్యయనాలు నిర్వహించామని, వ్యాధికారక కారణాన్ని ఫోమోప్సిస్ అజాడిరచ్టేగా గుర్తించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లుగా ఇది వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు. వేప డైబ్యాక్, ఇతర చెట్ల వ్యాధులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 9705893415 నంబర్లో సంప్రదించవచ్చునని జగదీశ్ తెలియజేశారు. -
హత్యా?ఆత్మహత్యా?
ఇన్స్పెక్టర్ జగదీష్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతుండగా అందిన వార్త ‘ప్రముఖ యువ నటి లలితారాణి ఆకస్మిక మరణం’. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న లలితారాణి, నందకుమార్ తమ పెళ్లి వార్తను ఒక వారంలో విడుదల చేస్తామన్న లోపే ఇలా జరగడం విచారకరం అని అన్ని టీవీ చానల్స్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తూ, మధ్య మధ్యలో ఆమెది సహజ మరణమా? ఆత్మహత్య?అని మరొక ట్విస్ట్‌కు తెరలేపుతున్నాయి. అది చూసి నివ్వెరపోయాడు జగదీష్ ఎందుకంటే అతను కూడా ఆమెకు అభిమాని. ఆమె ఇప్పుడిప్పుడే ధ్రువతారగా వెలుగుతోంది, ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగానే పారితోషకం తీసుకొంటోంది అలాంటి నటీమణి మరణం పలు అనుమానాలకు దారి తీస్తోంది. జగదీష్ భృకుటి ముడిపడింది ఇందులో ఏదో మర్మం దాగివుంది అని ఆలోచిస్తూనే జీపు ఎక్కాడు.‘‘సార్! స్టేషన్ వచ్చింది’’ అని డ్రైవరు అన్నాక గాని ఈ లోకంలోకి రాలేదు. కుర్చీలో కూర్చున్నాడో లేదో టేబుల్‌పైన ఫోన్ మోగింది. ‘‘హలో ఎవరు?’’‘‘సార్! నా పేరు ప్రభాకరం. నా కూతురు సినిమా హీరోయిన్ లలితారాణి మరణించింది... మీరు వెంటనే రావాలి’’జగదీష్ తన అసిస్టెంట్ ప్రసాద్‌తో కలిసి లలితారాణి బంగళాకు పోలీసు వెహికిల్‌లో బయలుదేరి వెళ్ళాడు. అప్పటికే ఆమె అభిమానులు గేటు బయట బారులు తీరి ఉన్నారు. ‘‘ఏంటి ప్రసాద్! మనకంటే ముందే ఇంతమంది రావడం’’ అని జగదీష్ అనేలోపే ‘‘ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం సార్!’’పోలీసు కారును చూడగానే గూర్ఖా గేటు తీశాడు అదే అదనుగా కొందరు అభిమానులు లోపలకు చొరబడబోయరు గూర్ఖా వారిని వారించాడు. లలిత నాన్న ప్రభాకరం, అతని చిన్న భార్య తులసి, హీరో నందకుమార్ విషణ్ణ వదనాలతో లలితారాణి డెడ్ బాడీకి కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. ఒక పక్కగా పనిమనిషి లక్ష్మి, ఆమె భర్త తోటమాలి శంకరయ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువవుతోందని తెలిసి పోలీసు ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి తగినంత బలగాన్ని పంపమన్నాడు జగదీష్. ‘‘ఎలా జరిగింది?’’ అని ప్రభాకరాన్ని అడిగాడు. ‘‘నిన్న రాత్రి షూటింగ్ నుంచి బాగా పొద్దు పోయాక అంటే సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చింది. మేడ మీద తన గదిలోకెళ్లిపడుకుంది. తెల్లారి ఎనిమిది గంటలైనా తలుపు తీయలేదు. లక్ష్మి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు కూడా తట్టింది. కిందికి వచ్చి మాకు విషయం చెప్పడంతో మేము పరుగున వెళ్లి తలుపును గట్టిగా తోస్తే బోల్ట్ ఊడి వచ్చింది. నిద్రపోతున్నట్టుగానే ఉంది. శరీరం పట్టుకొని చూస్తే పూర్తిగా చల్లబడింది. వెంటేనే మా ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేశాను. చనిపోయి కొన్ని గంటలవుతోందని చెప్పాడు’’‘‘ఆత్మహత్య చేసుకుందని కొన్ని టీవీ చానల్స్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. రాణి ఆత్మ హత్య చేసుకొనేంత పిరికిది కాదు సార్!’’ అంది తులసి. ‘‘అన్ని విషయాలూ బయటకు వస్తాయి. ముందుగా క్లూస్ టీమ్ వారు వారి పనులు చేసుకుని ఫోటోలు అవి తీసుకున్నాక డెడ్ బాడీని పోస్ట్‌మార్టంకు పంపే ఏర్పాట్లు చేద్దాము’’ అని ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పంపమన్నాడు. రిపోర్ట్ రావడానికి సాయంత్రం కావచ్చు అని ఇదే విషయాన్ని అభిమానులందరికీ చెప్పాడు.‘‘సార్ మా అభిమాన నటిది ఆత్మహత్య కాదు. ఇది కచ్చితంగా హత్యే వారిని ఎలాగైనా మీరు పట్టుకోవాలి’’ అన్నాడు ఒక అభిమాని.‘‘కడసారి చూపుకోసం ఎంతసేపయినా వేచివుంటాము సార్! అన్నారు’’ ముక్త కంఠంతో. ‘‘మీ అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. దయచేసి మాకు సహకరించండి. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’’ అన్నాడు జగదీష్. అంబులెన్స్ డెడ్ బాడీని తీసుకెళ్లాక ప్రభాకరంగారిని ఉండమని మిగతా వారిని పంపించి, జగదీష్, ప్రసాద్‌ల పర్యవేక్షణలో క్లూస్ టీమ్ లలితారాణి గదిలో ఆధారాల కోసం అన్వేషణ మొదలు పెట్టింది. టీపాయ్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్, దాని పక్కన సెల్ ఫోను తప్ప వారికి ఏమీ లభించలేదు. వాటిని స్వాధీనం చేసుకొని తలుపు గడియను బాగుచేయించి, తాళం వేయించి సీల్ చేసి కిందికి వచ్చారు. ఆ సమయానికి గుంటూరు నుంచి లలిత మేనత్త, ఆమె కొడుకు అంటే లలిత బావ చంద్రం వచ్చారు. వారిని మా అక్క, మా మేనల్లుడు అని జగదీష్‌కు పరిచయం చేశాడు ప్రభాకరం. ‘‘పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక మాట్లాడదాము’’ అని జగదీష్ ప్రభాకరానికి చెప్పి, సిబ్బందితో కలసి బయల్దేరాడు.పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. ప్రభాకరాన్ని రమ్మని కబురు పెట్టాడు జగదీష్. కొద్దిసేపటికి ప్రభాకరంతో పాటు నందకుమార్, చంద్రం కారులో వచ్చారు.‘‘అధిక మోతాదులో నిద్ర మాత్రలు వాడడం వల్ల లలితారాణి చనిపోయింది. ఆమె చనిపోయిన సమయం రాత్రి ఒంటిగంట’’ అని చెప్పి ప్రభాకరానికి రిపోర్ట్ ఇచ్చి డెడ్ బాడీని తీసుకెళ్లమన్నాడు జగదీష్.వారు వెళ్ళాక ‘‘ప్రసాద్! ఆ హాండ్ బ్యాగ్‌లో చిన్న పాకెట్ డైరీ, బాల్ పెన్, సెల్‌ఫోన్ మనకు ఏమైనా ఉపయోగపడ్డాయా?’’ అన్నాడు జగదీష్. ‘‘హాండ్ బ్యాగ్, అట్టతో ఉన్న పాకెట్ డైరీ, బాల్ పెన్‌ల మీద లలితారాణి వేలి ముద్రలు తప్ప వేరే వాళ్లవి లేవు సార్! సెల్ ఫోన్ డేటా కూడా ఉపయోగ పడలేదు. కానీ డైరీలో ఈ వాక్యాలు చూడండి సార్!’’‘బావకు నా ముఖం చూపించలేను.నాన్నకు పిన్నికి తలవంపులు తెచ్చాను’‘‘దీనిని బట్టి ఆమె ప్రెగ్నెంట్ అని అర్థమవుతోంది. అందువల్లే ఆత్మ హత్య చేసుకొని వుండవచ్చుకదా?’’ అన్నాడు ప్రసాద్. డెడ్ బాడీని అంబులెన్స్‌లో ఎక్కించే సమయంలో ప్రభాకరాన్ని, చంద్రాన్ని పిలిపించి డైరీలోని ఆ రెండు వాక్యాలను చూపించాడు. ‘‘ఆమె అంత్యక్రియలు రేపు అయిపోగానే ఎల్లుండి పరిశోధన మొదలుపెడతాము. అది పూర్తి అయ్యేవరకు ఈ విషయాలను మీరిద్దరూ చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పాడు. ‘‘అలాగే సార్’’ అన్నారు వారు. తమ అభిమాన నటిది ఆత్మహత్య కాదు, హత్య అని పలుచోట్ల ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు కొందరు అభిమానులు. పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్యన అభిమానులు సినీ పరిశ్రమ వారి ప్రముఖుల అశ్రునయనాల మధ్య లలితారాణి అంత్యక్రియలు జరిగాయి. జగదీష్, ప్రసాద్‌ను తీసుకొని తన మిత్రుడు డిటెక్టివ్ అయిన విశ్వంను కలవడానికి అతని ఇంటికి వెళ్లారు. ఎన్నో పరిశోధనలలో విశ్వం, జగదీష్‌కు సహాయపడ్డాడు. జగదీష్, ప్రసాద్‌లను సాధారంగా ఆహ్వానించాడు విశ్వం. స్నాక్స్ తింటూ టీ తాగుతున్న సమయంలో లలితారాణి తాలూకు డైరీని చూపించి,ఆ రెండు వాక్యాలను చదవమన్నాడు జగదీష్. అది చదివిన తరువాత విశ్వం ఫోన్ చేసి ఫోరెన్సిక్ లాబొరేటరీలో పనిచేసే కిరణ్‌ను వెంటనే రమ్మన్నాడు. కిరణ్ పావు గంటలో అక్కడకు చేరుకున్నాడు. విశ్వం అన్ని విషయాలూ చెప్పాడు. దస్తూరీ రిపోర్ట్ రావడానికి రెండు రోజుల సమయం పట్టవచ్చని డైరీని తీసుకు వెళ్లాడు.‘‘నీకు ఏ సమయంలోనైనా అందుబాటులో వుంటాను. నీ పరిశోధనను మొదలు పెట్టు’’ అన్నాడు జగదీష్‌తో విశ్వం. ‘‘అలాగే ఇప్పుడే లలితారాణి ఇంటికి వెళుతున్నాం..ఉంటా విశ్వం’’ అని చెప్పి బయలుదేరుతూ ప్రభాకరానికి వస్తున్నామని ఫోన్ చేశాడు. అక్కడకు చేరుకున్నాక ప్రభాకరం, తులసి, చంద్రం, లక్ష్మి, శంకరయ్యల నుంచి జగదీష్, ప్రసాద్‌లు విడి విడిగా విషయాలను సేకరించారు.రెండు రోజులకు వేలిముద్రల పరిశోధన రిపోర్టును, డైరీని కిరణ్ జగదీష్‌కు అందించాడు. ఆ రెండు వాక్యాలు లలితారాణివి కావని ఆ రిపోర్టులో ఉంది. లలితారాణి చనిపోయిన రోజున ఉదయం షూటింగ్ జరిగిన ప్రదేశం నుంచి కొన్ని వివరాలు సేకరించాడు ప్రసాద్, వాటిని జగదీష్ కు అందించాడు. రెండు రోజుల తరువాత అన్ని విషయాలను సమకూర్చుకొని జగదీష్. ప్రసాద్ కలిసి మళ్లీ విశ్వం వద్దకు వెళ్లారు. ‘‘మీరు సేకరించిన విషయాలలో ఎలాంటి లోపం లేదు రేపు ప్రెస్ వారిని కూడా పిలిచి దోషిని అరెస్ట్ చేయండి!’’ అన్నాడు విశ్వం. ప్రభాకరం ఇంట్లో అందరూ అందుబాటులో ఉండాలని ఒక ముఖ్యమైన విషయం ప్రకటిస్తానని ప్రెస్ వారికి కూడా కబురు పెట్టాడు. నందకుమార్, పల్లవి కూడా అక్కడకు చేరుకున్నారు.ప్రెస్ వారితో పాటు అందరూ సమావేశమయ్యారు. ‘‘ఏ విషయమో చెప్పండి సార్!’’ అన్నారు ప్రెస్ వాళ్లు. ‘‘ఆ విషయానికి వచ్చేముందు మీకు ఓ చిన్న కథ చెబుతాను...ఒక ఊరిలో ఒక అక్క, తమ్ముడు ఉన్నారు అక్కకు కొడుకు పుట్టాక బావ చనిపోయాడు. తమ్ముడికి కూడా వివాహమయ్యింది. అతను పట్నంలో కాపురం పెట్టాడు, అక్కడే వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఏడాదికి అతనికి అమ్మాయి పుట్టింది...మేనల్లుడికే తన అమ్మాయిని ఇస్తానని అక్కకు వాగ్దానం చేశాడు.వ్యాపారంలో బాగా నష్టం రావడంవల్ల దిగులుతో అతని భార్య కన్నుమూసింది. బిడ్డను చూసుకోవడానికని అక్క తమ్ముడికి మళ్లీ పెళ్లి చేసింది. కాలచక్రం గిర్రున తిరిగింది అల్లుడు ఏజీ బియస్సీ చేసి వ్యవసాయం చూసుకుంటున్నాడు. కూతురు ఇంటర్లో చేరింది. ఆ అమ్మాయి ఒకసారి కాలేజీలో డ్రామా వేసింది. అది చూసిన ఒక నిర్మాత ఆమె సినిమాకు పనికొస్తుందని చెప్పి ప్రముఖ హీరో పక్కన హీరోయిన్ చేశాడు. అలా ఆమె మంచి పేరు తెచ్చుకుంది ఆమెకు బావ అంటే ఎంతో ఇష్టం. కానీ ఒకసారి సముద్రంలో బోటులో షూటింగ్ సన్నివేశాలు చిత్రికరిస్తుండగా ఆ స్పాట్లో బోటు ప్రమాదం నుంచి ఆమెను హీరో కాపాడాడు. అప్పటి నుంచి హీరో ప్రేమలో పడింది. హీరో కూడా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అసలు చిక్కు అప్పుడే మొదలయ్యింది. హీరోకు కూడా ఒక మరదలు ఉంది. ఆమె బావను తప్ప ఎవ్వరినీ చేసుకోనని చెప్పింది.ఒక రోజు ఆమె హీరోయిన్ బావను కలిసి, నీవు నీ మరదలిని పెళ్లి చేసుకుంటేనే నా బావ నాకు దక్కుతాడు అని గట్టిగా చెప్పింది. కానీ లాభం లేక పోయింది. ఒక రోజు షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి వెళ్లింది. షూటింగ్ ప్యాకప్ చెప్పారు. అప్పుడు సమయం రాత్రి పదకొండు అయ్యింది. మేకప్ తీసివేయడానికి హీరో, హీరోయిన్లు మేకప్ రూమ్‌కు వెళ్లారు. ఆఫీస్ బాయ్ మూడు గ్లాసులతో పళ్ల రసాన్ని తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్లాడు. ఒకటి మాములుది, రెండు చల్లనివి.. మామూలు గ్లాసులో ఆమె ఇంటి నుంచి తెచ్చిన నిద్ర మాత్రలను కరిగించిన ద్రవాన్ని కలిపింది.ఎవరికి వారు వాళ్ల కార్లలో ఇళ్లకు బయలుదేరారు. హీరోయిన్ను ఆమె కారు డ్రైవరు పది నిముషాల్లో ఆమెను ఇంటి వద్ద దింపాడు. తక్కువ మోతాదు ఉన్న నిద్ర మాత్రలను ఎక్కువ శాతంలో కరిగించిన ద్రవం ఉన్న పళ్ల రసాన్ని ఆమె తీసుకోవడం వల్ల అది మెల్లగా ప్రభావం చూపి ఆమె కన్ను మూసింది’’‘‘ఆమెది ఆత్మహత్యగా రిపోర్ట్ వచ్చింది. ఎవరో ఆవిడ చెప్పండి సార్ టెన్షన్ గా వుంది’’ అన్నాడు ఒక విలేఖరి. ‘‘ఒక రోజు మేము హీరోగారి ఇంటికి వెళ్లాము అతనితో మాట్లాడుతుండగా అప్పుడు అతని మరదలు స్నాక్స్ కాఫీ తీసుకొచ్చింది. మాటల మధ్యలో మా మరదలు కవితలు బాగా రాస్తుందని చెప్పాడు. నా అసిస్టెంట్ డైరీ పెన్ను ఇచ్చి ‘మేడమ్ మా పోలీసు డిపార్ట్మెంట్ మీద ఒక కవిత వ్రాయండి వచ్చే సావనీర్లో వేస్తాము’ అన్నాడు. ఆమె కవిత వ్రాసేలోపల ఆమె గదిలోకి వెళ్లి సోదా చేశాడు. అక్కడ నిద్ర మాత్రల ప్రిస్క్రిప్షన్‌తో పాటు కొన్ని నిద్ర మాత్రలు డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో దొరికాయి’’ ‘‘సార్ ఆమె కవితలు వ్రాయడానికి హత్యకు ఎలాంటి సంబంధం ఉంది?’’ అన్నాడు ఒకతను. హీరోయిన్ డైరీలో రెండు వాక్యాలు రాసి వున్నాయి.ఒకటి’ మా బావకు నా ముఖం చూపించలేను... రెండవది నాన్నకు పిన్నికి తలవంపులు తెచ్చాను’ ఇవి, కవితలు వాసిన వారు ఒక్కరే. ఇక కథను ముగిస్తున్నాను..ఆ హీరోయిన్ లలితారాణి ఆమెను హత్య చేసింది ఎవరో కాదు నందకుమార్ గారి మరదలు పల్లవి. అక్కడే ఉన్న పల్లవి ముఖంలో రంగులు మారాయి. ‘‘పల్లవిగారు ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటారా?’’‘‘అవును నా బావ నాకు దక్కేలా లేడని నేనే ఈ పని చేశాను’’‘‘పోలీసులు పల్లవిని అరెస్ట్ చేశారు. నందకుమార్‌తో పాటు అందరూ నివ్వెరపోయి చూడ సాగారు. ‘‘చిక్కుముడిని ఎంతో చాకచక్యంగా విడదీసిన జగదీష్‌ను, ప్రసాద్‌ను అందరూ ప్రశంసించారు’’. యు.విజయశేఖర రెడ్డి -
ఆ మచ్చికంతా నీడలోనే
అదొక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఓ ధనికుడు. అతను ఖరీదైన ఓ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. ధనికుడు ఆ గుర్రాన్ని తనకున్న పచ్చికమైదానానికి తీసుకురమ్మని పనివాళ్ళను ఆదేశించాడు.ఆ తర్వాత ఆ పనివాళ్ళల్లో ఒకరిని వంతులవారీ దాని మీద ఎక్కి స్వారీ చేయమని చెప్పేవాడు.అయితే ఎవరు తన ముందుకు వచ్చినా ఆ గుర్రం తన ముందరి కాళ్ళను పైకెత్తి వారిని బెదరగొట్టి తరిమేసేది.ఎవరికీ లొంగేది కాదు.కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. ఆ పల్లెటూరుకి ఓ సూఫీ జ్ఞాని వచ్చాడు.ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న ధనికుడు ఆ జ్ఞానిని దర్శించుకున్నాడు. తాను కొన్న ఖరీదైన గుర్రం గురించి చెప్పాడు. అది మాట వినడం లేదని, మచ్చిక చేసుకునే మార్గం తెలియడం లేదని వాపోయాడు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో చెప్పవలసిందిగా కోరాడుధనికుడు చెప్పిన మాటలన్నీ విన్న సూఫీ జ్ఞాని సరేనని ఆ ధనికుడి ఇంటికి మరుసటి రోజు ఉదయమే వెళ్ళాడు.సూఫీ జ్ఞాని దగ్గరకు ఆ గుర్రాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. అది మేలుజాతి గుర్రమనీ, ఒక్కసారి మచ్చికవుతే చాలు అది సులువుగా దగ్గరవుతుందని, దాని తెలివితేటలు అపారమనీ జ్ఞానికి అర్థమైపోయింది. జ్ఞాని సమక్షంలో ఓ నౌకరు ఆ గుర్రం మీద ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఆ గుర్రం అతనిని అది ఎప్పటిలాగే ముందర కాళ్ళతో బెదిరించి తరిమేసింది.అది గమనించిన జ్ఞానికి ఓ ఆలోచన వచ్చింది.దాన్ని తూర్పు ముఖంగా చూస్తున్నట్టు నిలబెట్టమన్నారు జ్ఞాని.అలా నిలబెట్టిన తర్వాత ఓ నౌకరుని దాని మీదకు ఎక్కి కూర్చోమన్నారు. ఆ విధంగా చేసినప్పుడు ఆ గుర్రం ఏ మాత్రం తిరగబడలేదు. చక్కగా సహకరించింది.తన మీదకు ఎవరినీ ఎక్కించుకోవడానికి సహకరించని ఆ గుర్రం ఉదయం వేళల్లో తనకు వెనుకవైపు నుంచి వచ్చే సూర్యకిరణాలతో తన నీడా, తనపై ఎక్కడానికి ప్రయత్నించే వ్యక్తి నీడా భారీగా కనిపించడం వల్ల అది తెగ భయపడిపోయేది. ఈ విషయాన్ని గ్రహించిన జ్ఞాని తూర్పుముఖంగా దాన్ని నిలబెట్టమని చెప్పారు. ఇలా చేయడం వల్ల దాని నీడ దానికి వెనకాతలే పడడంతో దానికి మునుపటి భయం పోయింది. ఎవరు తన దగ్గరకు వచ్చినా ఏ మాత్రం తిరుగుబాటు చేయక అన్ని విధాలా సహకరించింది.ధనికుడికి ఆ గుర్రం మీద స్వారీ చేయాలన్న కోరికా తీరింది. జ్ఞానికి ధన్యవాదాలు తెలిపాడు. సమస్యెలా పరిష్కరించారని ధనికుడు అడగగా అంతా నీడలోనే ఉందని చెప్పి ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు. – యామిజాల జగదీశ్ -
ముగ్గురు సినీనటుల పోటీ.. ఎవరిదో విక్టరీ
పఠానపురం(కేరళ): కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పఠానపురం నియోజకవర్గం నుంచి ముగ్గురు సినీనటులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా మలయాళ హీరో కె.బి.గణేశ్ కుమార్ ఉన్నారు. ఆయన మూడు సార్లు యూడీఎఫ్ నుంచి గెలుపొంది ప్రస్తుతం ఎల్డీఎఫ్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ప్రముఖ కమెడియన్ జగదీశ్ యూడీఎఫ్ నుంచి, విలన్ పాత్రలు పోషించే రఘు దామోదరన్ అలియాస్ భీమన్ రఘు బీజేపీ నుంచి నామినేషన్ వేయడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా ఉంది. ఓటరు ఏ నటుడికి పట్టం కడతాడో ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే. మే 16న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. -
స్నేహితునిపై హత్యాయత్నం
ఆర్ధిక లావాదేవీలే కారణం పోలీసులు అదుపులో నిందితుడు అల్లిపురం: ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీలు చిచ్చుపెట్టాయి. ఏకంగా హత్యాయత్నానికి దారితీశాయి. అల్లిపురంలో శుక్రవారం జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీహరిపురానికి చెందిన గల్లా పోలిపల్లి అలియాస్ చిన్నా, రామ్‌నగర్‌కు చెందిన గుడేల్ జగదీష్‌లు స్నేహితులు, వీరి మధ్య వ్యాపారలావాదేవీలు ఉన్నాయి. అల్లిపురంలోని నారాయణవీధిలో గల అశోకారెసిడెన్సీలో గుడేల్ జగదీష్ తన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం జగదీష్ తన కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో చిన్నా అక్కడే ఉన్నాడు. ఆఫీస్‌లో కూర్చుందాం రా అని చిన్నాను ఆహ్వానించి, కార్యాలయంలోకి వెళుతుండగా అప్పటికే చిన్న తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో వెనుక నుంచి జగదీష్ తలపై బలంగా వేటు వేయడంతో అక్కడికక్కడే కూలిపోయాడు. అతని అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి చిన్నాను పట్టుకుని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ఎస్ఐ రామదాసు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు జగదీష్‌ను వారి కుటుంబసభ్యులు కేర్ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పిందని బాధితుని కుటుంబసభ్యులు తెలిపారు. బాధితుని సోదరుడు గుడేల బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘బెజవాడ బార్’ కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా జగదీష్ గెలుపు తీవ్ర ఉత్కంఠ నడుమ బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఎన్నికలు మంగళవారం ఉదయం జరిగాయి. బీబీఏ అధ్యక్షుడిగా చిత్తర్వు శివవెంకట జగదీశ్వరరావు(జగదీష్) ఘన విజయం సాధించారు. రాత్రి వెల్లడించిన ఫలితాల్లో ప్రారంభం నుంచి జగదీష్ ఆధిక్యత కనబరిచారు. 3,250 మంది పైచిలుకు న్యాయవాదులున్న బీబీఏలో 1,987 మంది మాత్రమే ఓటు వేసేందుకు అర్హత పొందారు. 1,500 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. విజయవాడ లీగల్ : ప్రతిష్టాత్మకంగా జరిగే బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ)ఎన్నికలు మంగళవారం జరిగాయి. 3,250 మంది పైచిలుకు న్యాయవాదులున్న బీబీఏలో 1,987 మంది మాత్రమే ఓటు వేసేందుకు అర్హత పొందారు. 1,500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీబీఏ అధ్యక్షుడిగా చిత్తర్వు శివ వెంకట జగదీశ్వరరావు(జగదీష్)తన సమీప అభ్యర్థులపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభ దశ నుంచే జగదీష్ ఆధిక్యత ప్రదర్శించారు. అధ్యక్ష పదవి కోసం చాలా రోజులుగా ఆయన కష్ట పడ్డారని పలువురు న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే 2015-2016 సంవత్సరానికి అధ్యక్షుడిగా గెలుపొందిన జగదీష్‌ను అధ్యక్షస్థానంలో కూర్చో బెట్టారు. జగదీష్ నగరంలో గల సిద్ధార్థ న్యాయకళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1992లో ఏపీబార్ కౌన్సిల్ సభ్యత్వాన్ని పొంది సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన రావు వద్ద శిష్యరికం చేశారు. 2006-2007లో బీబీఏకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా హోరాహోరిగా సాగిన ఓటింగ్‌లోతన సమీప అభ్యర్థిపై కె.జగజ్జీవన్‌రావు గెలు పొందారు.అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవికి తొలి మహిళ బోను జయమ్మ ఎన్నికయ్యారు. కార్యదర్శి పదవికి కె.కోటేశ్వర రావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా వై.పుల్లా రెడ్డి విజయం సాధించారు. మహిళా కార్యదర్శిగా మహాలక్ష్మి ఎన్నిక బీబీఏలో మహిళా కార్యదర్శి పదవికి కొనకళ్ళ మహాలక్ష్మి తన సమీప అభ్యర్థిపై 116 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈమె కానూరు సిద్ధార్థ న్యాయకళాశాలలో బీఎల్ పూర్తి చేశారు. 2006లో ఎ.పి.బార్ కౌన్సిల్లో సభ్యత్వం పొందారు. సీనియర్ న్యాయవాదులు కె.జయప్రభ, పి.శ్రీదేవి, ఎస్.కె.ఖాదిర్‌ల వద్ద శిష్యరికం చేశారు. మహాలక్ష్మి గెలుపుపై మహిళా న్యాయవాదులు మదుమాల హెప్సి, గంగా భవాని,ఎస్.సునీతా దాస్, పద్మజ, సంద్య తదితరులు హర్షం ప్రకటించారు. ఏకగ్రీవంగా కోశాధికారి, లైబ్రేరియన్ల ఎన్నిక బీబీఏ కోశాధికారిగా ఆకుల మధు బాబు,లైబ్రేరియన్‌గా జ.వి.సుబ్బారావులు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు చీఫ్ ఎన్నికల అధికారి డి.పి.రామకృష్ణ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్లు బీబీఏకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాదులు కర్నాటి రామ్మోహన రావు, బీబీఊ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంపర దుర్గశ్రీనివాసరావు, వజ్జే వెంకట రవి కుమార్ ఓటు వేశారు. పూనూరు గౌతంరెడ్డిలతో పాటు న్యాయవాది, స్థానిక 21వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కార్తీక్ పెద్ద హీరో అవుతాడు
‘‘పంపిణీదారునిగా ‘వైజాగ్’ రాజుకి మంచి పేరుంది. కార్తీక్ రాజు హీరోగా, సంగీతంలో రారాజైన మణిశర్మ స్వరసారథ్యంలో వైజాగ్ రాజు తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన డీవీ సీతారామరాజు (వైజాగ్ రాజు) తన కుమారుడు సత్య కార్తీక్ రాజుని హీరోగా పరిచయం చేస్తూ, నిర్మించిన చిత్రం ‘టిప్పు’. జగదీష్ దానేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు సీడీని ఆవిష్కరించి రాఘవేంద్రరావుకి ఇచ్చారు. పచార చిత్రాలూ, పాటలు బాగున్నాయనీ కార్తీక్ మంచి హీరోగా నిలదొక్కుకోవాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. కార్తీక్ నటించిన కొన్ని సీన్స్‌ని ఓ ప్రముఖ దర్శకుడు చూసి, మంచి భవిష్యత్తు ఉందని అభినందించారని వైజాగ్ సత్యానంద్ చెప్పారు. కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘వైజాగ్ రాజుతో నాది 40 ఏళ్ల స్నేహం. ఆయనో సినిమా పంపిణీ చేస్తే, కచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ ఉండేది. ఈ చిత్రంతో ఆయన తనయుడు పెద్ద హీరోగా నిలబడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత చెప్పారు. ఈ వేడుకలో టి. సుబ్బిరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, బి. గోపాల్, ఆర్. నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కనువిందుగా...
వైజాగ్ ప్రసాద్, జగదీశ్, విశ్వ, హరీష్, శ్రీనివాస్, అర్పిత, కీర్తి ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పాకశాల’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్‌కిరణ్, ఆర్పీ రావు నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మా ‘పాకశాల’ కనువిందుగా ఉంటుంది. ఇప్పటివరకు రాని కథాంశంతో ఈ చిత్రం చేశాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది. శ్రావణ్ మంచి స్వరాలిచ్చారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా తీశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
చైన్‌స్నాచర్ శివ కేసులో ముగ్గురి అరెస్ట్
-
చైన్‌స్నాచర్ శివ కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ కేసులో మొత్తం ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివ భార్య నాగలక్ష్మితో పాటు ముత్తూట్ ఫైనాన్స్ ఓంకార్ నగర్ బ్రాంచ్ మేనేజర్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3.75 కేజీల బంగారం, రూ.4.5లక్షల నగదు, 2 కార్లు, బైక్‌తో పాటు విలువైన ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శివ గ్యాంగ్‌పై సుమారు 700 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ సీవీ ఆనంద్ తెలిపారు. చైన్‌స్నాచర్ శివ ఆగస్ట్‌లో జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
గుడ్డిగా సంతకం చేశా
యువ తెలుగు నటుడు వైభవ్ తమిళం, తెలుగు భాషల్లో హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, వైభవ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. బ్రహ్మన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీకి తమిళంలో ఇది రెండో చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్ర తెలుగు వెర్షన్‌కు ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి శిష్యుడు జగదీష్ తమిళం వెర్షన్‌కు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు రాజు గణపతి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం ఒక స్నేహితుడి ద్వారా వచ్చిందని లావణ్య తెలిపారు. అయితే కథ విన్న వెంటనే నటించడానికి ఒప్పంద పత్రంపై గుడ్డిగా సంతకం చేసేశానని చెప్పారు. హీరో ఎవరు? ఇత్యాది వివరాల గురించి ఒక్కమాట కూడా అడగలేదన్నారు. కథ తనను అంతగా ఇంప్రెస్ చేసిందని పేర్కొన్నారు. తనది చిత్రంలో చాలా ఛాలెంజింగ్ పాత్ర అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ పాత్రలో నటించడానికి నెర్వెస్తోపాటు చాలా ఎగ్జైట్గాను ఉందని లావణ్య అంటున్నారు. ఈ చిత్రం తనను బిజీ హీరోయిన్ను చేస్తుందనే విశ్వాసాన్ని ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు. -
భర్తకు తోడుగా...పతిభక్తి చాటుకున్న నాగలక్ష్మి
ఇదీ గజదొంగ శివ స్నాచింగ్‌ల సంఖ్య భార్య రెక్కీ టార్గెట్ పూర్తిచేసేది శివ, జగదీష్, రాజ్‌కుమార్ ముగ్గురి అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ సభ్యులు విచారణలో వెల్లడించిన అంశాలు పోలీసుల దిమ్మెతిరిగి పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగ్ గత రెండేళ్లలో సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో 300 వరకు స్నాచింగ్‌లకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుకోగా.. విచారణలో 700 స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. ఇందులో సైబరాబాద్ పరిధిలోనే 500 చోరీలకు పాల్పడ్డారు. అందులో ఈ ఏడాది 250 స్నాచింగ్‌లకు పాల్పడి రికార్డు సృష్టించారని క్రైమ్ ఇన్చార్జి డీసీపీ జి.జానకీషర్మిల, ఏసీపీ రామ్ కుమార్‌లు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో గ్యాంగ్‌లీడర్ శివ మృతి చెందగా అతని భార్య నాగలక్ష్మి (30)తో పాటు అతని ఇద్దరు అనుచరులు జగదీష్ (30), రాజ్‌కుమార్ (23)లను సైబారాబాద్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 30 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లతో పాటు అతని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ ముగ్గురినీ తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించే అవకాశాలున్నాయని జానకీషర్మిల అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అయ్యేందుకు వచ్చి... రాజమండ్రికి చెందిన నాగలక్ష్మి, ఆమె సోదరి జూనియర్ ఆర్టిస్టుల య్యేందుకు 2005లో హై దరాబాద్‌కు వచ్చి కృష్ణానగర్‌లో స్థిరపడ్డారు. సోదరి టీవీ జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరింది. కృష్ణానగర్‌లోని బంధువుల వద్దకు వచ్చే క్రమంలో నాగలక్ష్మితో శివకు పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తకు తోడుగా... భర్త చేసే నేరాలలో తాను సైతం పాల్గొని పతిభక్తి చాటుకుంది నాగలక్ష్మి. ఆమె రెక్కీ ని ర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే శివ అతని అనుచరులు జగదీష్, రాజ్‌కుమార్ రంగంలోకి దిగి స్నాచింగ్ చేసేవారు. బస్తీలు, కాలనీలలో నాగలక్ష్మి తిరుగుతూ స్కూల్, గుడికి వెళ్లేవారిని, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వారిని గుర్తించి భర్తకు సమాచారం చేరవేసేది. వెంటనే ఒక్కరు..లేదా ముగ్గురూ కలిసి వెళ్లి ‘టార్గెట్’ పూర్తి చేసుకెళ్లేవారు. కడచూపునకు సైతం నిరాకరించిన తల్లిదండ్రులు.... నెల్లూరులో ఉంటున్న తల్లిదండ్రులు ప్రసన్న, మస్తానయ్య కుమారుడు శివ నేరబాట పట్టడంతో అతనిపై ఆశలు వదిలేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయాడని తెలిసి కన్నీరుపెట్టారు. అయితే, ఆఖరి చూపు చూసేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు శివ మృతదేహా న్ని కృష్ణానగర్‌లో ఉంటున్న తోడల్లుడు దుర్గాప్రసాద్‌కు అప్పగించగా.. ఇక్కడే ఆదివా రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒంటరైన కొడుకు... ఒకపక్క తండ్రి శివ మృతదేహం.. మరోపక్క చూద్దామంటే కనిపించని తల్లి నాగలక్ష్మి... దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి ఏకైక కుమారుడు శ్రీను (4)ను చూసి స్థానికులు కన్నీరుపెట్టారు. శివ ఇంట్లో పెరుగుతున్న ఉదయ్‌సాయి (8) తోడల్లుడి కుమారుడని తెలిసింది. రికవరీ కోసం ప్రయత్నాలు... వందలాది గొలుసు చోరీలకు పాల్పడిన శివ గ్యాంగ్ నుంచి సొత్తు రికవరీ చేసే పనిలో పడ్డారు క్రైమ్ పోలీసులు. స్నాచింగ్చేసి తెచ్చిన బంగారాన్ని నాగలక్ష్మి ముత్తూట్, శ్రీరామ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టింది. వీటికి సంబంధించిన రసీదులపై నాగలక్షితో పాటు శివ పేరు కూడా ఉన్నాయి. తాకట్టు పెట్టడమే కాకుండా కొంత బంగారాన్ని వీరు విక్రయించి జల్సా చేసినట్టు విచారణలో తేలింది. ఆ 24 మందీ టార్గెట్... నేరగాడు హైదరాబాద్ రావాలంటేనే దడ పుట్టే విధంగా నిఘా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులు దానికి తగ్గట్టు కార్యాచర ణ రూపొందిస్తున్నారు. శివ బాటలో పయణిస్తున్న 24మంది కరుడుగట్టిన స్నాచర్లను గుర్తించారు. వారి ఫొటోలు, వివరాలను అన్ని శాంతి భద్రతలు, సీసీఎస్ ఠాణాకు సైబారాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం పంపించి అధికారులను అప్రమత్తం చేశారు. వీరిలో ఏ ఒక్కరు కనిపించినా వెంటనే అరెస్టు చేయాలని సూ చించారు. వీరిలో కొందరిపై 100కు పైగా, మరికొందరిపై 50కి పైగా స్నాచింగ్ కేసులున్నాయి. కాగా శివ గ్యాంగ్ బారిన పడిన మహిళలు అభినందులు తెలుపుతూ ఆది వారం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఎస్సెమ్మెస్‌లు పంపారు. శివ గ్యాంగ్ దాడి లో మూడు నెలల క్రితం గాయపడి అప స్మారక స్థితికి చేరిన రాంగోపాల్ భార్య వా రం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. కాగా, శివ దాడిలో గాయపడిన ఎస్ఐ వెంకట్ ఆస్పత్రిలో కోలు కుంటు న్నాడు -
రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు
దేవరపల్లి: రుణమాఫీ ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను, డ్వాక్రా మహిళలను నట్టేటముంచారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ గడా జగదీష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రుణమాఫీపై పొంతనలేని ప్రకటనలు చేస్తూ రైతులను, మహిళలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. టీడీపీ కర్యకర్తలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రౌడీయిజం చేస్తూ దాడులు చేస్తున్నారని తలారి ఆరోపించారు. టీడీపీ గూండాయిజం, రౌడీయిజాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మండల పార్టీ కన్వీనర్ గడా గదీష్ మాట్లాడుతూ గౌరీపట్నం పార్టీ నాయకుడు ఆండ్రు రమేష్‌బాబు టీడీపీ డబ్బుకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. మండలంలో 12 మంది ఎంపీటీసీలను ప్రజలు గెలిపించి ఎంపీపీ అధికారం కట్టబెట్టగా ధనబలంతో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను కొనుగోలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కేవీకే దర్గారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్.రాజేంద్రబాబు, మండల యూత్ కన్వీనర్ కొఠారు ధృవకాంత్, పార్టీ నేతలు పల్లి వెంకట రత్నారెడ్డి, కవల సుబ్బారావు, కె.వీరభద్రరావు, కాండ్రు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉదయనిధితో సమంత
యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు చెన్నై చిన్నది సమంత సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఒరుకల్ ఒరుకన్నాడి, ఇదు కదిర్వేలన్ కాదల్ కంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న మూడో చిత్రం నన్బెండా దర్శకుడు రాజేష్ శిష్యుడు జగదీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ తదురి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన హీరోయిన్లు, దర్శకుల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తారన్న టాక్ ఉంది. తొలి చిత్రంలో హన్సికను హీరోయిన్గా ఎంచుకున్న ఉదయనిధి తదుపరి రెండు చిత్రాల్లోనూ నయనతారనే ఎంపిక చేసుకున్నారు. తాజా చిత్రం కోసం ప్రస్తుత క్రేజీ హీరోయిన్ సమంతపై ఆయన కన్ను పడిందని సమాచారం. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు జీవా, త్రిష ఆండ్రియా హీరోహీరోయిన్లుగా ఎండ్రెండ్రుం పున్నగై వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సమంత విజయ్ సరసన కత్తి, సూర్యతో అంజాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి విక్రమ్తోను జోడీ కట్టనున్నారు. ఈ మధ్యలో ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతారని సమాచారం. అదేవిధంగా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న సిద్ధార్థ్‌తో కూడా ఒక చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.