గుడ్డిగా సంతకం చేశా | blindly i am signed for that movie | Sakshi
Sakshi News home page

గుడ్డిగా సంతకం చేశా

Published Wed, Aug 20 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

గుడ్డిగా సంతకం చేశా

గుడ్డిగా సంతకం చేశా

యువ తెలుగు నటుడు వైభవ్ తమిళం, తెలుగు భాషల్లో హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, వైభవ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. బ్రహ్మన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీకి తమిళంలో ఇది రెండో చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్ర తెలుగు వెర్షన్‌కు ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి శిష్యుడు జగదీష్ తమిళం వెర్షన్‌కు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు రాజు గణపతి దర్శకత్వం వహించనున్నారు.
 
ఈ చిత్రంలో నటించే అవకాశం ఒక స్నేహితుడి ద్వారా వచ్చిందని లావణ్య తెలిపారు. అయితే కథ విన్న వెంటనే నటించడానికి ఒప్పంద పత్రంపై గుడ్డిగా సంతకం చేసేశానని చెప్పారు. హీరో ఎవరు? ఇత్యాది వివరాల గురించి ఒక్కమాట కూడా అడగలేదన్నారు. కథ తనను అంతగా ఇంప్రెస్ చేసిందని పేర్కొన్నారు. తనది చిత్రంలో చాలా ఛాలెంజింగ్ పాత్ర అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఈ పాత్రలో నటించడానికి నెర్వెస్‌తోపాటు చాలా ఎగ్జైట్‌గాను ఉందని లావణ్య అంటున్నారు. ఈ చిత్రం తనను బిజీ హీరోయిన్‌ను చేస్తుందనే విశ్వాసాన్ని ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement