ఆ  మచ్చికంతా  నీడలోనే | A wealthy man bought an expensive horse | Sakshi
Sakshi News home page

ఆ  మచ్చికంతా  నీడలోనే

Published Sun, Apr 15 2018 1:56 AM | Last Updated on Sun, Apr 15 2018 1:56 AM

A wealthy man bought an expensive horse - Sakshi

అదొక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఓ ధనికుడు. అతను ఖరీదైన ఓ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. ధనికుడు ఆ గుర్రాన్ని తనకున్న పచ్చికమైదానానికి తీసుకురమ్మని పనివాళ్ళను ఆదేశించాడు.ఆ తర్వాత ఆ పనివాళ్ళల్లో ఒకరిని వంతులవారీ దాని మీద ఎక్కి స్వారీ చేయమని చెప్పేవాడు.అయితే ఎవరు తన ముందుకు వచ్చినా ఆ గుర్రం తన ముందరి కాళ్ళను పైకెత్తి వారిని బెదరగొట్టి తరిమేసేది.ఎవరికీ లొంగేది కాదు.కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. ఆ పల్లెటూరుకి ఓ సూఫీ జ్ఞాని వచ్చాడు.ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న ధనికుడు ఆ జ్ఞానిని దర్శించుకున్నాడు. తాను కొన్న ఖరీదైన గుర్రం గురించి చెప్పాడు. అది మాట వినడం లేదని, మచ్చిక చేసుకునే మార్గం తెలియడం లేదని వాపోయాడు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో చెప్పవలసిందిగా కోరాడుధనికుడు చెప్పిన మాటలన్నీ విన్న సూఫీ జ్ఞాని సరేనని ఆ ధనికుడి ఇంటికి మరుసటి రోజు ఉదయమే వెళ్ళాడు.సూఫీ జ్ఞాని దగ్గరకు ఆ గుర్రాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. అది మేలుజాతి గుర్రమనీ, ఒక్కసారి మచ్చికవుతే చాలు అది సులువుగా దగ్గరవుతుందని, దాని తెలివితేటలు అపారమనీ జ్ఞానికి అర్థమైపోయింది. జ్ఞాని సమక్షంలో ఓ నౌకరు ఆ గుర్రం మీద ఎక్కడానికి ప్రయత్నించాడు.

అయితే ఆ గుర్రం అతనిని అది ఎప్పటిలాగే ముందర కాళ్ళతో బెదిరించి తరిమేసింది.అది గమనించిన జ్ఞానికి ఓ ఆలోచన వచ్చింది.దాన్ని తూర్పు ముఖంగా చూస్తున్నట్టు నిలబెట్టమన్నారు జ్ఞాని.అలా నిలబెట్టిన తర్వాత ఓ నౌకరుని దాని మీదకు ఎక్కి కూర్చోమన్నారు. ఆ విధంగా చేసినప్పుడు ఆ గుర్రం ఏ మాత్రం తిరగబడలేదు. చక్కగా సహకరించింది.తన మీదకు ఎవరినీ ఎక్కించుకోవడానికి సహకరించని ఆ గుర్రం ఉదయం వేళల్లో తనకు వెనుకవైపు నుంచి వచ్చే సూర్యకిరణాలతో తన నీడా, తనపై ఎక్కడానికి ప్రయత్నించే వ్యక్తి నీడా భారీగా కనిపించడం వల్ల అది తెగ భయపడిపోయేది. ఈ విషయాన్ని గ్రహించిన జ్ఞాని తూర్పుముఖంగా దాన్ని నిలబెట్టమని చెప్పారు. ఇలా చేయడం వల్ల దాని నీడ దానికి వెనకాతలే పడడంతో దానికి మునుపటి భయం పోయింది. ఎవరు తన దగ్గరకు వచ్చినా ఏ మాత్రం తిరుగుబాటు చేయక అన్ని విధాలా సహకరించింది.ధనికుడికి ఆ గుర్రం మీద స్వారీ చేయాలన్న కోరికా తీరింది. జ్ఞానికి ధన్యవాదాలు తెలిపాడు. సమస్యెలా పరిష్కరించారని ధనికుడు అడగగా అంతా నీడలోనే ఉందని చెప్పి ఓ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయారు.
– యామిజాల జగదీశ్‌    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement