ఉదయనిధితో సమంత
యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు చెన్నై చిన్నది సమంత సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఒరుకల్ ఒరుకన్నాడి, ఇదు కదిర్‌వేలన్ కాదల్ కంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న మూడో చిత్రం నన్బెండా దర్శకుడు రాజేష్ శిష్యుడు జగదీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ తదురి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన హీరోయిన్లు, దర్శకుల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తారన్న టాక్ ఉంది.
తొలి చిత్రంలో హన్సికను హీరోయిన్‌గా ఎంచుకున్న ఉదయనిధి తదుపరి రెండు చిత్రాల్లోనూ నయనతారనే ఎంపిక చేసుకున్నారు. తాజా చిత్రం కోసం ప్రస్తుత క్రేజీ హీరోయిన్ సమంతపై ఆయన కన్ను పడిందని సమాచారం. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు జీవా, త్రిష ఆండ్రియా హీరోహీరోయిన్లుగా ఎండ్రెండ్రుం పున్నగై వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సమంత విజయ్ సరసన కత్తి, సూర్యతో అంజాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి విక్రమ్‌తోను జోడీ కట్టనున్నారు. ఈ మధ్యలో ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతారని సమాచారం. అదేవిధంగా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న సిద్ధార్థ్‌తో కూడా ఒక చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.