విడాకుల అనంతరం దర్శకులకు కొత్త కండిషన్స్‌ పెడుతోన్న సామ్‌! | Samantha New Conditions For Directors After Divorce With Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Samantha:దర్శకులకు కొత్త కండిషన్స్‌ పెడుతోన్న సామ్‌!

Published Mon, Oct 18 2021 9:39 AM | Last Updated on Mon, Oct 18 2021 11:45 AM

Samantha New Conditions For Directors After Divorce With Naga Chaitanya - Sakshi

Samantha New Conditions To Directors: విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతోంది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పటికి తన కెరీర్‌ను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు సామ్‌. ఇప్పటికే ఆమె శాకుంతలంలో నటించగా, తమిళంలో విజయ్‌ సేతుపతితో  ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సామ్‌ ఇప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌ నయన తారను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం సమంత తన సినిమాలు, షూటింగ్‌ల విషయంలో దర్శకులకు కొత్త నిబంధనలు పెడుతోందట. వాటికి సరే అంటేనే సినిమా సైన్ చేస్తోందట. 

చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి

ఇక సమంత కండీషన్స్‌ కూడా అంత ఇబ్బందికరంగా లేకపోవడంతో దర్శక-నిర్మాతలు కూడా ఒకే అంటున్నారట. తాను ఒప్పుకుంటున్న సినిమాల షూటింగ్స్‌ కేవలం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలని నిర్మాతలకు కండీషన్స్‌ పెడుతోందట సామ్‌. ఒకవేళ హైదరాబాద్‌లో షూటింగ్‌ అయితే ఇండోర్‌ మాత్రమే పెట్టాలని కొరుతుందట. ఏం చేసిన ఇండోర్‌ షూట్స్‌ పెట్టమని చెబుతున్నట్లు సమాచారం. ఇక పబ్లిక్‌లో షూటింగ్‌ అయితే అసలు వద్దని చెబుతోందట. తన కండీషన్స్‌కు ఓకే చెప్తేనే సినిమాలకు సైన్ చేస్తోందట లేదంటే నో చెబుతోందని వినికిడి. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ చేయడానికి సమంత పెద్దగా ఆసక్తి చూపడం లేదని, ఇంకా కొంతకాలం తను చెన్నైలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

చదవండి: రాజీనామాలపై అప్పుడే ఆలోచిస్తా: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు

ఇదిలా ఉంటే  శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించబోతున్న ఓ మూవీ కోసం ఆయన సమంతను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ మూవీకి తాను సైన్‌ చేసేందుకు పైన పేర్కొన్న కండిషన్స్‌ పెట్టిందట సమంత. అలాగే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో తెరకెక్కే ఈ చిత్రం కోసం సామ్‌ ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. హరి, హరీశ్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం షూటింగ్‌ నవంబర్‌ నుంచి మొదలు కానుందట. కాగా కేవలం ఇండోర్‌ షూటింగ్స్‌కే నయన్‌ ఆసక్తి చూపుతోందని గతంలో వార్తలు వినిపించాయి. అలాగే సినిమా ప్రమోషన్స్‌కు కానీ, ఇతర ఈవెంట్స్‌కు నయన్‌ హజరయ్యేందుకు ఇష్టం పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సామ్‌ కూడా నయనతార తరహాలోనే కండిషన్స్‌ పెడుతోందంటూ సినీ వర్గాలు చర్చించకుంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement