మూర్ఖులతో వాదించలేమంటూ నయనతార పోస్ట్‌ | Doctor Liver Doc Comments On Nayanthara Health Remedy | Sakshi
Sakshi News home page

నయనతార సలహాపై డాక్టర్‌ ఫైర్‌

Jul 30 2024 11:44 AM | Updated on Jul 30 2024 12:09 PM

Doctor Liver Doc Comments On Nayanthara Health Remedy

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ నయనతారకు సమంత లాంటి పరిస్థితే వచ్చింది. కొద్దిరోజుల క్రితం సమంత ఒక హెల్త్‌ టిప్ పంచుకుంది. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చెయ్యండం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని సలహా ఇచ్చింది. అప్పుడు ఆ రెమిడీని ది లివర్ డాక్ తప్పుపట్టారు. ఇప్పుడు అలాంటి వివాదమే మళ్లీ చర్చకు వచ్చింది.  అదే డాక్టర్‌ నయనతారతో పేచీ పెట్టుకున్నాడు.

తాజాగా నయనతార తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేసింది. మందార టీతో ఎన్నో లాభాలు ఉన్నాయంటూ ఆమె తెలిపింది. మందార టీలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని, దీనిని తీసుకోవడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థను సమతౌల్యంగా ఉంచుతుందని నయన్‌ తెలిపింది. ఇది సీజనల్ ఇన్‌ఫెక్షన్/అనారోగ్యం నుండి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుందని చెప్పింది. డయాబెటిస్ నుంచి మొటిమల వరకు ఎన్నింటినో ఈ టీ పెద్ద ఉపసమనాన్ని కలిగిస్తుందని ఆమె పేర్కొంది. ఆపై మందారం టీ ఎలా తయారు చేసుకోవాలో రెసిపీని కూడా ఆమె పంచుకుంది.

నయనతార ఆరోగ్య చిట్కా గురించి డాక్టర్‌ లివర్ డాక్ ఫైర్‌ అయ్యారు. మందార టీ కాస్త టేస్టీగా ఉంటుందని చెప్పి ఆపి ఉంటే పర్వాలేదు.. కానీ, ఇలా అవగాహన లేని చిట్కాలు ఎందుకు చెబుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ప్రజారోగ్యంపై సర్జికల్ స్ట్రైక్ లాగా సెలబ్రిటీల అందరూ ఈ రకమైన ఉచిత సలహాలు ఇవ్వడాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. అందుకు కావాల్సిన చట్టాలను తీసుకురావాలని ఆయన కోరారు.  శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోగ్య సలహాలు ఇవ్వకూడదని అలా చేయడం వల్ల  ప్రజారోగ్యం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.

మందారం టీ మధుమేహం, రక్తపోటు, మొటిమలకు ప్రయోజనకరమైనదని, యాంటీ బాక్టీరియల్ కలిగి ఉంటుందని నయనతార చెప్పడం వల్ల వారు తమ ఆరోగ్య-నిరక్షరాస్యతను చాటుకుంటున్నారని ఆయన అన్నారు.  పైన పేర్కొన్న మెడికల్ క్లెయిమ్‌లు ఎక్కడా ధృవీకరించబడలేదని ఆయన తెలిపారు.

మందారం టీ గురించి ఉన్న పోస్ట్‌ను నయనతార తొలిగించింది. కానీ, అందుకు క్షమాపణ చెప్పలేదని లివర్‌ డాక్‌ కామెంట్‌ చేశారు. మందారం టీ గురించి నయనతార తన హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్ మున్మున్ గనేరివాల్ (@munmun.ganeriwal) చెప్పినట్లుగా మాత్రమే ఆమె తెలిపింది. కానీ లివర్‌ డాక్‌ మాత్రం ఆమెపై ఫైర్‌ అయ్యారు.

కొంత సమయంలో తర్వాత నయనతార పరోక్షంగా స్పందిస్తూ ఇన్‌స్టాలో మరో పోస్ట్‌ చేసింది. ప్రముఖ రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన పాపులర్ కోటేషన్‌ను తన స్టోరీలో పంచుకుంది. 'మూర్ఖులతో ఎప్పుడూ వాదించకండి, వారు మిమ్మల్ని వారి స్థాయికి లాగి, ఆపై అనుభవంతో మిమ్మల్ని కొడతారు' అని తెలిపింది. ఇదంతా డాక్టర్‌ లివర్‌ డాక్‌ గురించే నయనతార కామెంట్‌ చేసిందని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement