Samantha, Nayanathara And Vijay Sethupathi Recreate Sathya Scene For Kaathu Vaakula Rendu Kadhal - Sakshi
Sakshi News home page

Samantha: ఫుట్‌బోర్డ్‌పై సమంత, నయన్‌, విజయ్‌.. వీడియో వైరల్‌

Published Mon, Aug 23 2021 5:13 PM | Last Updated on Mon, Aug 23 2021 7:23 PM

Samantha Nayantara And Vijay Sethupathi Foot Board Bus Video Goes Viral - Sakshi

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్‌’. ఇందులో సమంత,  విజయ్‌ సేతుపతి, నయనతారలు లీడ్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ పుదుచ్చేరిలో షూటింగ్‌జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో బస్సులో చిత్రీకరించిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో విజయ్‌ సేతుపతి, నయనతార, సమంతలు బస్సులో ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ఉన్నారు. అయితే ఈ సీన్‌ చూస్తుంటే అచ్చం అమలా, కమల్‌ హాసన్‌ జంటగా గతంలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం సత్యా మూవీలోని ‘వలై ఓసై’ పాట సీన్‌ను తలపిస్తుంది.

చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్‌ అనుమానాస్పద మృతి..

ఇందులో కమల్ హాసన్ లాగే విజయ్‌ సేతుపతి వైట్‌ షర్ట్‌, టైతో నల్ల ప్యాంటు ధరించి ఉండగా.. పక్కనే సమంత, నయన్‌లు అమలా మాదిరిగా తెల్ల చీర కట్టుకుని ఉన్నారు. కాగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం) 2021 గాను సమంతకు ఉత్తమ నటి అవార్డు వరించిన సంగతి తెలిసిందే. సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే ఐఎఫ్‌ఎఫ్‌ఎం 2021 ఈ అవార్డ్స్‌కు ఎన్నికైన నటీనటుల జాబితాను ఇటీవల ప్రకటించింది. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’కు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా సమంత ఈ ఆవార్డును అందుకోనుంది.

చదవండి: IFFM: రాజీ నటనకు దిగొచ్చిన అవార్డు.. ఉత్తమ నటిగా సమంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement