udhayanidhi
-
రజనీ చిత్ర టైటిల్లో ఉదయనిధి
తమిళసినిమాలకు పేర్ల కొరత ఏర్పడిందని చెప్పవచ్చు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాయితీలు ఒక కారణం కావచ్చు. చిత్రాల పేర్లు తమిళంలో ఉంటేనే రాయితీలన్న ప్రభుత్వ నిబంధనలు దర్శకనిర్మాతను ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే మాట వినిపిస్తోంది. పేర్ల కొరత కారణంగానే పాత పేర్ల అన్వేషణలో పడుతున్నారు. ఇక పలువురు కుర్ర హీరోలు సూపర్‌స్టార్ చిత్రాల పేర్లను తమ చిత్రాలకు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. రజనీకాంత్ స్థాయికి ఎలాగూ చేరలేం. ఆయన చిత్రాల పేర్లతోనైనా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలనే భావిస్తున్నారు. రజనీకాంత్ చిత్రాల పేర్లతో ఇప్పటికే కొన్ని చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం నటుడు జీవా పోకిరిరాజా, విజయ్‌సేతుపతి ధర్మదురై పేర్లను వాడుకుంటున్నారు.ఈ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.తాజాగా ఉదయనిధి స్టాలిన్ సూపర్‌స్టార్ చిత్ర టైటిల్‌ను వాడుకోవడానికి రెడీ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం గెత్తు గురువారం తెరపైకి వచ్చింది. తదుపరి చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. హిందీ చిత్రం జాలీ ఎల్ఎల్బీ రీమేక్‌లో ఉదయనిధిస్టాలిన్ నటిస్తున్నారు.ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం ఫేమ్ అహ్మద్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి హన్సిక నాయకిగా నటిస్తున్నారు.ఉదయనిధి స్టాలిన్ తొలి చిత్రం(ఒరుకల్ ఒరుకన్నాడి)కథానాయకి ఈమె అన్నది గమనార్హం. ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి మణిదన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం టైటిల్ అన్న విషయం గమనార్హం. -
ఉదయనిధితో హన్సిక మరోసారి రొమాన్స్
నటి హన్సిక తన క్రేజీ తనాన్ని కొనసాగిస్తోంది. ఇటీవల విడుదలైన రోమియోజూలియట్ చిత్రంతో విజయ పరంపర కొనసాగిస్తున్న ఈ ముంబాయి ముద్దుగుమ్మ త్వరలో విజయ్‌కు జంటగా నటించిన పులి తో తెరపైకి రానంది. జయప్రద కొడుకు సిద్ధూతో నటించిన ఉయిరే ఉయిరే చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అరణ్మణై-2 చిత్రంతో బిజీగా ఉన్న హన్సికకు తాజాగా ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఉదయనిధి తొలి హీరోయిన్ ఈ బ్యూటీనే నన్నది తెలిసిన విషయమే. ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంతో ఈ జంట తొలి హిట్‌ను నమోదు చేసుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఉదయనిధి హీరోయిన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లున్నారు. క్రేజీ హీరోయిన్లనే తన చిత్రాల్లో ఎంపిక చేసుకుంటున్నారు. తొలి చిత్రంలో హన్సికను, ఆ తరువాత ఇదు కదిరవేలన్ కాదల్, నన్బేండా చిత్రాల్లో వరుసగా నయనతారను ఎంచుకున్నారు. తాజా చిత్రం గెత్తులో ఐ చిత్రం ఫేమ్ ఎమిజాక్సన్తో డ్యూయెట్లు పాడుతున్నారు. ఈ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో నూతన చిత్రానికి రెడీ అయిపోతున్నారు. హిందీ చిత్రం జానీ ఎల్ ఎల్ బీ తమిళ రీమేక్‌లో నటించనున్న ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రంలో హన్సికను ఎంపిక చేసుకున్నారన్నది తాజా సమాచారం. వీరిద్దరి రొమాన్స్ సన్నివేశాలు త్వరలో తెరకెక్కనున్నాయి. నటుడు రాధారవి, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందించనున్నారు. -
ధనుష్ బదులు శింబు
ఇంతకు ముందు వణక్కం చెన్నై చిత్రం ద్వారా నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక దర్శకురాలిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్రం సక్సెస్ కావడంతో ఈ మహిళా దర్శకురాలు మలి ప్రయత్నంగా ధనుష్ హీరోగా ఆయన సొంత బ్యానర్ వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ధనుష్ యువ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నానుం రౌడీదాన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తదుపరి తన అన్నయ్య దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో కృతిక ఉదయ నిధి స్టాలిన్ దర్శకత్వంలో చిత్రం చెయ్యలేని పరిస్థితి నెలకొనడంతో ఆ చిత్రంలో నటించడానికి కూడా టాటా చెప్పారని సమాచారం. తాజాగా కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వంలో ధనుష్‌కు బదులు శింబు నటించనున్నారని తెలిసింది. ఈ సంచలన నటుడు నటించిన వాలు చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది. తదుపరి కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వంలో నటించడానికి రెడీఅవుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది కొద్ది రోజుల్లో తెలియనుంది. -
ఉదయనిధితో రెండో సారి
ఉదయనిధి స్టాలిన్‌తో రెండోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది హన్సిక. ఈ ఉత్తరాది భామ ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ రేస్‌లో ముందున్నారు. అయితే ఈమెకీ స్థాయి నందించిన చిత్రాల్లో ఒరుకల్ ఒరుకన్నాడి ఒకటని కచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఉదయనిధి స్టాలిన్, హన్సికల కలయికలో తెరకెక్కిన ఫస్ట్ చిత్రం హిట్ చిత్రం ఇది. ఈ చిత్రం తరువాత ఉదయనిధి స్టాలిన్ నయనతార సరసన ఇదు కదిర్ వేలనిన్ కాదల్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం యావరేజ్ చిత్రంగానే నిలిసింది. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం నన్బెండాలోను నయనతారనే తన హీరోయిన్గా ఎంచుకున్నారు. ఈ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఉదయనిధి స్టాలిన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో తన తొలి చిత్ర నాయిక హన్సికనే ఎంపిక చేసుకున్నారన్నది తాజా సమాచారం. అహ్మద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో సెట్‌పైకి రానుంది. చక్కని కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రంతో ఉదయనిధి స్టాలిన్, హన్సిక మరో హిట్ కొట్టడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఈ చిత్రంలో నటించనున్న ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సమాచారం. -
ఉదయనిధితో సమంత
యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు చెన్నై చిన్నది సమంత సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఒరుకల్ ఒరుకన్నాడి, ఇదు కదిర్వేలన్ కాదల్ కంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న మూడో చిత్రం నన్బెండా దర్శకుడు రాజేష్ శిష్యుడు జగదీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ తదురి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన హీరోయిన్లు, దర్శకుల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తారన్న టాక్ ఉంది. తొలి చిత్రంలో హన్సికను హీరోయిన్గా ఎంచుకున్న ఉదయనిధి తదుపరి రెండు చిత్రాల్లోనూ నయనతారనే ఎంపిక చేసుకున్నారు. తాజా చిత్రం కోసం ప్రస్తుత క్రేజీ హీరోయిన్ సమంతపై ఆయన కన్ను పడిందని సమాచారం. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు జీవా, త్రిష ఆండ్రియా హీరోహీరోయిన్లుగా ఎండ్రెండ్రుం పున్నగై వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సమంత విజయ్ సరసన కత్తి, సూర్యతో అంజాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. తదుపరి విక్రమ్తోను జోడీ కట్టనున్నారు. ఈ మధ్యలో ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతారని సమాచారం. అదేవిధంగా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న సిద్ధార్థ్‌తో కూడా ఒక చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఉదయనిధి పిటిషన్
తమిళసినిమా, న్యూస్‌లైన్ : డీఎంకే నేత స్టాలిన్ కొడుకు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ పిటిషన్‌ను విచారించిన చెన్నై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిం ది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి ప్రభుత్వ రాయితీ కోరుతూ ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్ మూవీ స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో నటించిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్ అని, ఇది తమిళ పేరుతో రూపొందిన చిత్రం అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిత్రానికి తమిళంలో పేరు పెడి తే రాయితీలు అందిస్తున్నారన్నారు. వినోదపు పన్ను రద్దు చేస్తున్నారన్నా రు. కాబట్టి తమ చిత్రానికి వినోదపు పన్ను రద్దు కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువలన మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి తమ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారిం చిన న్యాయమూర్తి ధనపాలన్ ఈ వ్యవహారంపై వచ్చే శుక్రవారం లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
సాటి నటుడి గురించి మంచిగా మాట్లాడినా తప్పేనా?
నయనతారకు వ్యక్తిగతంగా కోలీవుడ్ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కెరీర్ పరంగా విజయాలు అందుతున్నాయని ఆనందపడాలో... వ్యక్తిగతంగా రూమర్లు వెంటాడుతున్నాయని బాధ పడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం నయన. ఇటీవలే... ‘ఆరంభం’తో తమిళనాట మంచి విజయం అందుకున్నారామె. ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో.. తాజాగా ఓ కొత్త గాసిప్ ఆమెను మానసికంగా బాధకు గురిచేసింది. వివరాల్లోకెళితే.. ఉదయ్‌నిధి స్టాలిన్ సరసన ‘ఇదు కదిర్వేలన్ కాదల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు నయన. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఉదయ్నిధే కావడం విశేషం. మీడియా సమావేశాలకు అరుదుగా హాజరయ్యే నయన... ఇటీవల నిర్వహించిన ఈ సినిమా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నయన చేసిన తప్పిదం అదే. ఈ సమావేశంలో నయన మాట్లాడుతూ ‘‘ఉదయ్‌కి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సాధారణంగా వర్ధమాన నటులతో నటించేటప్పుడు కాస్త టెన్షన్ ఉంటుంది. అయితే నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే... తనతో నటించేటప్పుడు నాకు ఎలాంటి టెన్షనూ కలగలేదు. ఓ గొప్ప స్టార్‌తో నటిస్తున్న ఫీలింగ్’’ అని ఉదయ్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకేముంది కట్ చేస్తే... ‘‘ఉదయ్‌ని అంతగా పొగడటానికి కారణం ఏంటి? నయనకీ ఉదయ్‌కీ మధ్య ఏం నడుస్తోందీ..’ అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. దాంతో నయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. ‘‘నా జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కంటే... మీడియాలో వచ్చిన కథనాలే నన్ను ఎక్కువగా బాధించాయి... బాధిస్తున్నాయి. సాటి నటుడి గురించి కాస్త మంచి మాటలు చెప్పినా తప్పేనా?’’ అని వాపోయారు నయన.