ఉదయనిధితో రెండో సారి | Udhayanidhi to romance Hansika in Ahmed's next? | Sakshi
Sakshi News home page

ఉదయనిధితో రెండో సారి

Published Wed, Aug 27 2014 1:55 AM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

ఉదయనిధితో రెండో సారి - Sakshi

ఉదయనిధితో రెండో సారి

ఉదయనిధి స్టాలిన్‌తో రెండోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది హన్సిక. ఈ ఉత్తరాది భామ ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ రేస్‌లో ముందున్నారు. అయితే ఈమెకీ స్థాయి నందించిన చిత్రాల్లో ఒరుకల్ ఒరుకన్నాడి ఒకటని కచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఉదయనిధి స్టాలిన్, హన్సికల కలయికలో తెరకెక్కిన ఫస్ట్ చిత్రం హిట్ చిత్రం ఇది. ఈ చిత్రం తరువాత ఉదయనిధి స్టాలిన్ నయనతార సరసన ఇదు కదిర్ వేలనిన్ కాదల్ చిత్రంలో నటించారు.
 
 ఈ చిత్రం యావరేజ్ చిత్రంగానే నిలిసింది. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం నన్బెండాలోను నయనతారనే తన హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది.  ఉదయనిధి స్టాలిన్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో తన తొలి చిత్ర నాయిక హన్సికనే ఎంపిక చేసుకున్నారన్నది తాజా సమాచారం. అహ్మద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో సెట్‌పైకి రానుంది. చక్కని కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రంతో ఉదయనిధి స్టాలిన్, హన్సిక మరో హిట్ కొట్టడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఈ చిత్రంలో నటించనున్న ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement