రొట్టె విరిగి నేతిలో పడింది! | Sayesha to Romance Pawan Kalyan | Sakshi
Sakshi News home page

రొట్టె విరిగి నేతిలో పడింది!

Published Wed, Dec 14 2016 11:45 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

రొట్టె విరిగి నేతిలో పడింది! - Sakshi

రొట్టె విరిగి నేతిలో పడింది!

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అంటారు. మంచి మంచి అవకాశాలు దక్కినప్పుడు ఆ మాట అనడం సహజం. ‘అఖిల్‌’ చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన హిందీ భామ సాయేషా సైగల్‌కు ఇది వర్తిస్తుంది. ఈ చిత్రం తర్వాత హిందీలో ‘శివాయ్‌’లో నటించిన సాయేషా ఇప్పుడు ‘వనమగన్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కోసం రెండు రోజుల క్రితం చెన్నైలో ఉన్న ఈ పందొమ్మిదేళ్ల టీనేజ్‌ బ్యూటీ ‘వర్దా’ తుపాను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నైలో కరెంటు కట్‌ చేశారనీ, తాను బస చేసిన హోటల్‌లో జనరేటర్‌ పాడైపోవడంతో చీకట్లో భయంగా గడిపాననీ ఆమె అన్నారు.

 చివరికి చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు. ఈ సినిమా షూటింగ్‌ వియత్నాంలో ప్లాన్‌ చేయడంతో అక్కడికి ప్రయాణమయ్యారు. కానీ, హైదరాబాద్‌లో ఆమె గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. తమిళ దర్శకుడు నేసన్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా ఏయం రత్నం నిర్మించనున్న చిత్రానికి సాయేషాను కథానాయికగా అనుకుంటున్నారట. ఆమెను సంప్రదించారని కూడా తెలిసింది. చేస్తున్న తమిళ సినిమాతో పాటు సాయేషా ఇప్పటికి మూడు సినిమాల్లో నటించినట్లు అవుతుంది. తక్కువ సమయంలో పవన్‌ కల్యాణ్‌ సరసన ఛాన్స్‌ అంటే... సాయేషా పంట పండినట్లే కదా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement