రామ్‌గోపాల్‌ వర్మ ఫొటోలు దహనం | Ram Gopal Varma Photos Were Burning Protest In Anantapur | Sakshi
Sakshi News home page

రామ్‌గోపాల్‌ వర్మ ఫొటోలు దహనం

Published Sun, Apr 22 2018 8:00 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

Ram Gopal Varma Photos Were Burning Protest In Anantapur - Sakshi

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఫొటోలను  తగలబెడుతున్న బలిజ సంఘం నాయకులు

అనంతపురం కల్చరల్‌ : మహిళలను కించపరుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు బలిజ సంఘం నాయకులు మునిరత్నం శ్రీనివాసులు హితవు పలికారు. పవన్‌కల్యాణ్‌ తల్లిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యాలు, అందుకు వివిధ రకాలుగా ప్రేరేపించిన రామ్‌గోపాల్‌ వర్మ చేసిన చర్యలను ఖండిస్తూ శనివారం బలిజ సంఘం నాయకులు స్థానిక శ్రీనివాసనగర్‌లోని బాలాజీ కల్యాణ మంటపం ఎదుట రామ్‌గోపాల్‌ వర్మ ఫొటోలను దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా మునిరత్నం శ్రీనివాసులతో పాటు పగడాల మల్లికార్జున, మాసూలు శ్రీనివాసులు, భవానీ రవికుమార్, గల్లా హర్ష, పత్తి చంద్రశేఖర్‌ తదితరులు మాట్లాడారు. సిద్ధాంతాల ప్రకారం విమర్శలుండాలే కానీ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మోహన్, లక్ష్మీప్రసాద్, గొంది శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement